Breaking News

బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తా…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, కె. బుచ్చి రాంప్రసాద్ అన్నారు.

మచిలీపట్నం విచ్చేసిన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ , కె. బుచ్చి రాంప్రసాద్ మచిలీపట్నంలో ఆదివారం ఎన్ వి లక్ష్మీనారాయణ పవన్ శర్మ కు చిరు వ్యాపారం చేసుకుని ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇచ్చే గ్రూపులోను రెండు లక్షల 50 వేల రూపాయల చెక్కును ఎన్ వి ఎస్ లక్ష్మీనారాయణ పవన్ శర్మ కు అందజేసి మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్రంలో బ్రాహ్మణ సంక్షేమానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది అన్నారు.

గత వైసిపి ప్రభుత్వం లో బ్రాహ్మణ సంక్షేమాన్ని ఎంత మాత్రం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుపేద బ్రాహ్మణులను ఆదుకునే విధంగా అనేక రకాల పథకాలను అమలు చేస్తున్నాము అన్నారు. ముఖ్యంగా ఈ డబ్ల్యూ సు కార్పొరేషన్ నుండి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండోమెంట్ లో అనుసంధానం చేయడం ద్వారా చంద్రబాబు బ్రాహ్మణ సంక్షేమానికి పెద్దపీట వేశారు అన్నారు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయంలోనూ అర్చకుడు తో పాటు ఒక బ్రాహ్మణుడిని కమిటీలో ఉంచి ఆధ్యాత్మికంగా, రాజకీయంగా బ్రాహ్మణ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాలపై దాడులు, అర్చకులపై దాడులు ఎన్నో జరిగాయని గుర్తు చేశారు.

ముఖ్యంగా బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా నిరుపేద బ్రాహ్మణులు ఆర్థికంగా చిరు వ్యాపారాలు చేసుకుని బలోపేతం అయ్యెందుకు బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా గ్రూపు లోన్లు, ఉన్నత విద్య కోసం రుణాలు, అర్చక మిత్ర పథకం ద్వారా అర్చకులకు లోన్లు ఇలా ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతోంది అన్నారు.

బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కె. బుచ్చి రాంప్రసాద్ తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాలకు అన్ని రకాల ఏర్పాట్లు కూటమి ప్రభుత్వం చేస్తోంది అని తెలిపారు.

మచిలీపట్నంలో పేర్ని నాని బ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనం కోసం ఎన్నో అడ్డంకులు సృష్టించారని, మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి ల సహకారంతో ఆ భవన నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్, పి. వి. ఫణి కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గొర్రెపాటి గోపీచంద్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్, చోడవరపు లక్ష్మీ ప్రసన్న, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్, సిహెచ్ వివిఎస్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *