Breaking News

Andhra Pradesh

యు.జి.డి కి డి.పి.ఆర్ తయారు చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను(యు.జి.డి) పక్కాగా ఏర్పాటు చేయుటకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డి.పి.ఆర్) తయారు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు గుంటూరు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి సి.యం.సాయి కాంత్ వర్మ జిఎంసి అధికారులను ఆదేశించారు. గుంటూరు పట్టణంలో యు.జి.డి, నిరంతర నీటి సరఫరా, సుందరమైన కూడళ్లు, పార్క్ ఏర్పాటు, పి.వి.ఎన్ నాయుడు మార్కెట్ పునర్నిర్మాణ పనులుపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిఎంసి అధికారులతో సమీక్షించారు. …

Read More »

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అన్నారు. జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పోల్యుషణ్ కంట్రోల్ బోర్డు మరియు హార్ట్ ఫుల్ సెంటర్ వారి ఆధ్వర్యంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ నుండి తారకరామ నగర్ వరకు ప్రజల అవగాహన కొరకు ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని నగర కమిషనర్ జెండా ఊపి ప్రారంభించి, ప్రజలు విధ్యార్ధులతో కలిసి సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, …

Read More »

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సిపిఐ ఖండన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో కమ్యూనిజం చచ్చిపోయింది అని దుందుడుకు వ్యాఖ్యలు చేయటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న హైదరాబాదులో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందుకే కమ్యూనిజం చచ్చిపోయింది’ అని వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. …

Read More »

అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు 34 కోట్ల రూపాయలు కేటాయించాలని సిపిఐ మెమోరాండం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా అలగనూరు రిజర్వాయర్ కు ఏర్పడిన గండిని పూడ్చి మరమ్మతులు చేయడానికి 34 కోట్ల రూపాయలు మంజూరు చేసి నందికొట్కూరు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేస్తూ సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు కె.రామకృష్ణ,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.రామాంజనేయులు మంగళవారం రాత్రి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ను రాష్ట్ర సచివాలయం లో కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్ …

Read More »

పవన్ కల్యాణ్.. హుందాగా వ్యవహరించాలి

-ప్రాంతీయ విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలా? -బీజేపీ అజెండా రుద్దే ప్రయత్నాలు విరమించాలి -సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగాను, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ తన హోదాలకు తగిన విధంగా హుందాగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తప్పుపట్టారు. ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై దృష్టి సారించకుండా..కేవలం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విధ్వేషాల్ని రెచ్చగొట్టేలా వ్యవహరించడమేమిటని నిలదీశారు. ఈ మేరకు బుధవారం రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. …

Read More »

బాధితుడి కుటుంబానికి  ఎల్ ఓ సీ అందజేత..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లేటర్ ఆఫ్ క్రెడిట్) ను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జున తో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 42 వ డివిజన్ భవానిపురం కు చెందిన కేశవ రమేష్ (57) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఐదుగురు బాధితులకు రూ 18 లక్షల 57 వేల విలువైన ఎల్ ఓ సీ పత్రాలు అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను బుధవారం ఎన్డీఏ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, అత్తలూరి ఆదిలక్ష్మీ పెదబాబు ,దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, కూటమి నేతలతో కలిసి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అందజేశారు. 48వ డివిజన్ ,వాగు సెంటర్ కు చెందిన ఈ సింహాచలం ( 70) హృద్రోగం తో బాధపడుతూ ఓ …

Read More »

ఆర్టీసిలో విధ్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలనే విధానాన్ని విరమించుకోవాలి

-ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ నిర్ణయము చేయుటకు ఈనెల 8న విజయవాడలో ఆర్టీసి ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశం నిర్వహిస్తున్నాము -ఆర్టీసి యన్.యం.యు.ఏ & ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు వెల్లడి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ బస్సులను నడిపించే విధానాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని,ఈవిద్యుత్ బస్సులు కొనుగోలుకు ప్రవేటు ఆపరేటర్లకు కేంధ్రప్రభుత్వం ఇస్తున్న రాయితీలను రాష్ట్రప్రభుత్వం,ఆర్టీసి యాజమాన్యం తీసుకొని ఆర్టీసి సిబ్బందితోనే స్వంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ …

Read More »

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు

-ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యం -పుణ్య స్నానాలకు 10 కోట్ల మంది వస్తారని అంచనాలు -6 జిల్లాల్లో కొత్తగా 237 ఘాట్లు నిర్మించాలని ప్రతిపాదనలు -త్వరలో పుష్కర లోగో విడుదల – విస్తృతంగా ప్రచారం -గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, చారిత్రక వైభవం ఉట్టిపడేలా… మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున …

Read More »

ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్ పెడదాం

-జిల్లాల్లో పరిష్కారం కాని ఇళ్ల సమస్యలను కెబినెట్‌కు తీసుకురండి -గృహనిర్మాణ శాఖలో పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దృష్టి పెట్టండి -ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాల్లో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంత వరకు చేయగలరో చేయాలని… జిల్లా స్థాయిలో క్రమబద్దీకరణ కుదరన పక్షంలో కెబినెట్‌కు తీసుకు రావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని …

Read More »