Breaking News

Monthly Archives: November 2024

నవంబర్ 30తేది (నేడు) మధ్యాహ్నం నుండి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్టోబర్ 30వ తేది (నేడు) శనివారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు, జూనియర్ కళాశాలలకు మధ్యాహ్నం నుండి సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగాల్ తుఫాన్ గా మారడం వలన జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు …

Read More »

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర

మోపిదేవి, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసం పురస్కరించుకుని శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం కల్పించారు. స్వామి వారిని దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేసి స్వామి వారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .

Read More »

ముందు రోజే పింఛన్ల పండుగ

-కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ముందడుగు -తొలిరోజే 100 శాతం పెన్ష‌న్ల పంపిణీకి అధికారులు, సిబ్బంది కృషిచేయాలి -ఏపీ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయడంలో ముందడుగు వేస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.  ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను అందిస్తారు. అయితే డిసెంబరు ఒకటో తేదీ ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదని …

Read More »

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

– నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. నిత్యం గోవింద నామాలతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో, గత కొంతకాలంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది, దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. దీంతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ …

Read More »

రాష్ట్రంలో ఒక రోజు ముందే పెన్షన్ల పండుగొచ్చింది

– 65 లక్షల మందికి రూ.4000 పెన్షన్ కూటమికి మాత్రమే సాధ్యమైంది – జగన్ రెడ్డి రూ.3000 హామీకి తూట్లు పొడిచి వృద్దుల్ని దగా చేశారు. – పెన్షన్లు ప్రారంభించింది టీడీపీనే.. దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్నదీ టీడీపీనే మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పెన్షన్ పథకాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒకటో తేదీ ఆదివారం …

Read More »

2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10 – వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 4 – రథసప్తమి ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు జూన్ 9 – 11 – శ్రీవారి …

Read More »

మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు జెకె గ్రూప్ సుముఖత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతిష్టాత్మక జెకె గ్రూప్ ప్రతినిధులు రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. గతంలో కర్ణాటక, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని జెకె గ్రూప్ బావించినప్పటికీ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవతో రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు సుముకత వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలోని ఐదో బ్లాక్ లో ఉన్న మంత్రి కార్యాలయంలో జెకె గ్రూప్ ప్రతినిధులు మంత్రి …

Read More »

రెవెన్యూ సేవలు సులభతరం కావాలి… ఆన్లైన్ లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలి

-దృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి ఉండకూడదు -రెవెన్యూ శాఖలో ప్రజల అర్జీల పరిష్కారంపై థర్డ్ పార్టీతో ఆడిట్ -ఆన్లైన్ రికార్డులు మార్చి ప్రజలను భయపెట్టి భూములు కొట్టేసిన వారిపైన కఠిన చర్యలు -రెవెన్యూ శాఖ సమూల ప్రక్షాళన….తప్పు చేసే అధికారులకూ శిక్ష -రీసర్వేతో తెలెత్తిన 2.29 లక్షల సమస్యల సత్వర పరిష్కారం…. సమస్యలకు తావు లేకుండా రీ సర్వే చేపట్టాలి -ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన 7,827 ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ లపై విచారణ -రెవెన్యూ శాఖపై సమీక్షలో …

Read More »

రాజధానిలో భారీ స్థాయిలో ESI హాస్పిటల్, మెడికల్ కాలేజీ

-గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు రాని సంస్థలు -డిసెంబర్ చివరికి సంస్థలకు భూ కేటాయింపులు పూర్తి -జనవరి మొదటి వారం నుంచి రాజధాని నిర్మాణ పనులు -మీడియా సమావేశంలో మంత్రి నారాయణ… అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ మూడు ముక్కలాటతో రాజధానిలో కార్యాలయాల ఏర్పాటుకు సంస్థలు ముందుకు రాలేదన్నారు మంత్రి నారాయణ….2019 కి ముందు 131 సంస్థలకు భూములు కేటాయించగా…వాటిలో కొన్ని మాత్రమే తమ కార్యాలయాలు ఏర్పాటు ప్రారంభించాయన్నారు…భూములు కేటాయించిన ఇతర సంస్థల నుంచి రాతపూర్వకంగా …

Read More »

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో విశాఖ డైరీ అవినీతి విచారణకు ప్రత్యేక హౌస్ కమిటీ ఏర్పాటు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు. కమిటీ చైర్మన్: జ్యోతుల నెహ్రూ, కమిటీ సభ్యులు: బొండ ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పళ్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, ఆర్.వి.ఎస్.కే.కె. రంగా రావు, దాట్ల సుబ్బరాజు లను నియమించారు. కమిటీ సమగ్ర విచారణ జరిపి, …

Read More »