– పుట్టగొడుగుల పెంపకం లాభదాయక స్వయం ఉపాధి మార్గం – ఎస్‌హెచ్‌జీ మహిళలు అవకాశాలను వినియోగించుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు రైజ్ కేంద్రం ద్వారా నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా పుట్టగొడుగుల పెంపకం. డిజైనింగ్ వస్త్రాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ …
Read More »Daily Archives: May 9, 2026
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహమే లక్ష్యం
-ప్రకృతి సేద్య ఉత్పత్తులతో రైతులు, వినియోగదారులకూ మేలు -ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల మొబైల్ వెహికల్‌ను సందర్శించిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తున్న ఉత్పత్తులను విక్రయించేందుకు విజయవాడలోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ విల్లాస్‌లోప్రారంభించిన మొబైల్ వెహికల్‌ను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆహార స్వయంసమృద్ధి సాధనలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. పరిమిత వనరులతోనే ఇతర దేశాలు మిద్దె తోటల ద్వారా …
Read More »అత్యాధునిక సాంకేతికతతో పట్టాదారు పాసు పుస్తకాలు
– ఎన్నడూ లేని విధంగా సురక్షిత ఫీచర్లతో పంపిణీ – భూ యాజమాన్య వ్యవస్థలో సరికొత్త మైలురాయి.. – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : దేశానికే ఆదర్శంగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, రైతుల శ్రేయస్సు లక్ష్యంగా తీర్చిదిద్దుతోందని.. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అనుసంధానంతో పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో అందిస్తోందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం ఎ.కొండూరు మండలం, మాధవరంలో జరిగిన పట్టాదారు పాసుపుస్తకాల …
Read More »ఈ నెల 11న ఆర్‌టీఐహెచ్- స్టార్టప్ ఎక్స్‌పో
– జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు – యువ ఆవిష్కర్తల మేధో ప్రదర్శనకు సరైన వేదిక – జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 11న జాతీయ సాంకేతిక దినోత్సవం (National Technology Day) సందర్భంగా విజయవాడ, ఎనికేపాడులోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)లో స్టార్టప్ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, వినూత్న ఆలోచనలతో …
Read More »గన్నవరం నియోజకవర్గంలో 123 మంది లబ్ధిదారులకు రూ.77,47,637 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పెండింగ్‌లో ఉన్న 55 మంది దరఖాస్తుదారులకు కూడా నేడు ఆర్థిక సాయం అందజేత గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయ చెక్కులను ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. గన్నవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 123 మంది లబ్ధిదారులకు రూ.77,47,637 విలువైన చెక్కులను ఆయన స్వయంగా పంపిణీ చేశారు. …
Read More »జిల్లాను అగ్రగామిగా నిలపాలి…
-వినూత్న కార్యక్రమాలను ఆలోచించాలి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాలను రాష్ట్రంలోనే మొదటి ఐదు స్థానాలలో ఉండేలా కృషి చేయాలన్నారు. ప్రధానంగా కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్, ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో అందిన అర్జీలు శత శాతం పరిష్కారం, కేటాయించిన …
Read More »సి.యం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో పర్యటించనున్న దృష్ట్యా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ ఎ.భార్గవ తేజ, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలసి జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ముఖ్యమంత్రి వచ్చే మార్గం, ప్రజలు వచ్చే మార్గం వాటి పరిస్థితులు పరిశీలించారు. ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాటు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను …
Read More »లక్ష్మీపురం మేజర్ డ్రైన్ నిర్మాణ పనుల పూర్తికి 4 రోజులే తుది గడువు… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో కీలకమైన లక్ష్మీపురం మెయిన్ రోడ్ మేజర్ డ్రైన్ నిర్మాణ పనులు 4 రోజుల్లో పూర్తి చేయాలని, గత 2 నెలలుగా డ్రైన్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యంపై కాంట్రాక్టర్ కి నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఎస్ఈ ని ఆదేశించారు. శనివారం లక్ష్మీపురం, బృందావన్ గార్డెన్స్ ల్లోని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పర్యటించి, పెండింగ్ పనుల వేగవంతంపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »అద్దాల మేడలు కాదు ఆసుపత్రులు కట్టండి… : పేర్ని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదవాడు వైద్యునిగా తయారయ్యే దారి ప్రభుత్వ వైద్య కళాశాలలే అని, అభివృద్ధి పేరిట లక్షల కోట్లు వృధాగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిపిపి విధానాన్ని ఉపసంహరించుకుని నిర్మాణంలో ఉన్న 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను వాటికి అనుబంధంగా ఆసుపత్రులను తక్షణమే పూర్తి చేయాలని లేని పక్షంలో 2029 ఎన్నికల కౌంటింగ్ జరిగే సాయంత్రం వరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటి పోరాటం చేస్తుందని వైసిపి సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. …
Read More »సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంప్ లో వేరికోస్ వైన్స్ చికిత్సలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 37, 53 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. క్యాంప్ ద్వారా పలు సాధారణ అనారోగ్య సమస్యలతో పాటు వేరికోస్ వెయిన్స్ కు ప్రముఖ వాస్క్యూలర్ సర్జన్ ఎస్ డీ కే శశిధర్ పలు సమస్యలకు వైద్య సహాయం అందించారు. సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో …
Read More »
Prajavartha Online Telugu News