గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల (జిటిఎస్) ఏర్పాటు అత్యావశ్యకమని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. నగర పరిధిలో జిటిఎస్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేందుకు గోరంట్ల, ఆటో నగర్ ల్లోనిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జిటిఎస్ ల నిర్మాణానికి ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో పనిచేసి, స్థల కేటాయింపులకు …
Read More »Monthly Archives: May 2026
రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై అధికారులతో ప్రత్యేక సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజలు : బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులను పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులతో రోడ్డు విస్తరణ పనుల వేగవంతంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో బృందావన్ గార్డెన్స్ నుండి హనుమయ్య కంపెనీ వరకు విస్తరణ పనులను వేగంగా రోజు …
Read More »కరెంటు తీగలకు అడ్డు వస్తున్న చెట్ల కొమ్మలను నరికిన అనంతరం ప్రత్యేక వాహనం ద్వారా తొలగించాల్సిన బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు వారిపై ఉంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో కరెంటు తీగలకు అడ్డు వస్తున్నచెట్ల కొమ్మలను నరికిన అనంతరం, సదరు కొమ్మలను ప్రత్యేక వాహనం ద్వారా తొలగించాల్సిన బాధ్యత ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు వారిపై ఉందని నగర కమిషనర్ కే.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం కమిషనర్ ఛాంబర్ నందు ఎలక్ట్రిసిటీ డిపార్టుమెంటు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత నగరంలో చెట్ల కొమ్మలను నరికే బృందాలు ఎన్ని ఉన్నాయి, సదరు బృందాలు ఎక్కడెక్క పనిచేస్తుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »విద్యార్థుల స్టార్టప్‌లకు బలోపేతం…మయూఖా కనెక్ట్స్
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో యువ ఫౌండర్ల కీలక భేటీ -విద్యార్థులకు నెట్‌వర్కింగ్, అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి -త్వరలో విజయవాడలో అధికారిక ప్రారంభం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు స్టార్టప్‌లు ప్రారంభించడంలో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా మయూఖా కనెక్ట్స్ అనే వినూత్న ఇనిషియేటివ్‌ను ప్రారంభిస్తున్నట్లు యువ ఫౌండర్ యాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశతో జరిగిన భేటీలో, విద్యార్థుల స్టార్టప్‌లకు సంబంధించిన ప్రధాన సమస్యలు—ప్రత్యేకంగా నెట్‌వర్కింగ్ లోపం, సరైన ఎకోసిస్టమ్ లేకపోవడం …
Read More »నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
– చిన్నపాటి లోటుపాట్లు కూడా లేకుండా సౌకర్యాల కల్పన – పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి – అధికారులు, సిబ్బందికి కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 3వ తేదీ ఆదివారం జరిగే జాతీయస్థాయి వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ (యూజీ)-2026 నిర్వహణకు ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం నగరంలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (ఎస్‌పీఏ) సమావేశ మందిరంలో నీట్-2026 …
Read More »ఎస్ఎస్ సి (SSC) పబ్లిక్ పరీక్షలు, మార్చి 2026 – జవాబు పత్రాల రీకౌంటింగ్ మరియు రీ-వెరిఫికేషన్ ప్రక్రియ కు దరఖాస్తుల ఆహ్వానం…..
-ప్రభుత్వ పరీక్షల విభాగం, డైరెక్టర్ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మార్చి 2026లో జరిగిన SSC (పదవ తరగతి) పబ్లిక్ పరీక్షలకు సంబంధించి, జవాబు పత్రాల రీకౌంటింగ్ (Recounting) మరియు రీ-వెరిఫికేషన్ (Re-verification) కోసం ఆన్‌లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం, డైరెక్టర్ డాక్టర్ కె.వి. శ్రీనివాసులు రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల (మే) ఒకటవ తేదీ (శుక్రవారం) నుండి ఏడవ తేదీ (గురువారం) వరకు అభ్యర్థులు తమ సంబంధిత పాఠశాల …
Read More »‘పది’లమైన ప్రతిభకు కీర్తి కిరీటం!
– అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించిన కలెక్టర్ లక్ష్మీశ – భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచన – విజయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్రను ప్రశంసించిన కలెక్టర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థి దశలో కీలకమైన పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాభినందనలు తెలియజేస్తున్నానని, ఈ విజయం స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ …
Read More »ఆలోచన నుంచే ఆరంభం… ఆత్మవిశ్వాసమే మూలధనం
– ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలి – ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలి – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారతకు పారిశ్రామిక రంగం కీలక వేదిక అని.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించాలని.. మంచి ఆలోచనతో ఆత్మవిశ్వాసమే మూలధనంగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శనివారం గొల్లపూడిలోని డీఆర్‌డీఏ కార్యాలయంలో రైజ్ ఆధ్వర్యంలో భారతీయ యువశక్తి ట్రస్ట్ భాగస్వామ్యంతో …
Read More »సత్యనారాయణపురంలో ఉచితంగా పూల మొక్కల పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వేసవికాలంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే ఉద్యానవనాలకు ముఖ్య కారణం మొక్కలేనని విజయవాడ నగర పాలక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ (హార్టికల్చర్) చంద్రశేఖర్ అన్నారు. సత్యనారాయణపురం లో శనివారం సాయంత్రం కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు ఉచితంగా పూల మొక్కలను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ మాట్లాడుతూ ప్రజలు కూడా ప్రతి ఇంట్లో మొక్కలను పెంచే అలవాటు చేసుకుని, వారి ఇంటిని ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చుకునే దిశగా విజయవాడ నగర పాలక సంస్థ …
Read More »జన గణన చేసే యెన్యుమరేటర్లకు సహకరించండి…
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ మరియు చీఫ్ సెన్సస్ ఆఫీసర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జన గణన – 2027లో ప్రజలందరూ పాల్గొనాలని విజయవాడ నగరపాలక సంస్థ మరియు చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ ధ్యానచంద్ర పిలుపునిచ్చారు. తొలిదశలో భాగంగా మే 1 నుంచి 30వ తేదీ వరకు ఇండ్ల గణన (CENSUS-2027) జరుగుతుందని, ఇందులో భాగంగా మొదటి 3 రోజులు ఎన్యూమరేటర్లందరూ వారికి కేటాయించిన ప్రాంతాలను విస్తృతంగా తిరిగి పూర్తి అవగాహన తెచ్చుకుంటారని, తదుపరి ప్రతి ఒక ఎన్యూమరేటర్ వారికి …
Read More »
Prajavartha Online Telugu News