Breaking News

Daily Archives: September 2, 2026

యుద్ధప్రాతిపదికన నందికొట్కూరు డంపింగ్ యార్డ్ పనులు

-ఈ నెలాఖరికి చెత్త ప్రాసెసింగ్ కేంద్రం ట్రయల్ రన్ పూర్తి కావాలి -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశాలు నందికొట్కూరు, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా నందికొట్కూరులోని డంపింగ్ యార్డ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆదేశాలు అధికారులను, ఏజెన్సీవారిని ఆదేశించారు. నందికొట్కూరు మున్సిపాల్టీ పరిధిలోని డంపింగ్ యార్డ్ ని చైర్మన్ పట్టాభిరామ్ బుధవారం పరిశీలించారు. ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. …

Read More »

హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్లపై విస్తృత తనిఖీలు

-పరిశుభ్రత, ఆహార నాణ్యత, తాగునీటి ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్లలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, తాగునీటి ప్రమాణాలపై ప్రజారోగ్య అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం గుణదల, ఊర్మిళానగర్, లబ్బీపేట ప్రాంతాల్లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఆర్వో ప్లాంట్లపై ప్రజారోగ్య అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వంటగదుల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, పరిసరాల శుభ్రత, సిబ్బంది …

Read More »

శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం కబేళాకు సెలవు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జంతువుల వధ, మాంసం విక్రయాలపై నిషేధం విధించినట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ ఎం బుధవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 03-09-2026 (గురువారం) రాత్రి నుండి కబేలాలో ఎటువంటి జంతువులను వధించుటకు అనుమతి లేదని నగరంలో ఉన్న అన్ని చికెన్ షాప్లు మటన్ షాప్లు చేపల మార్కెట్లు తెరుచుటకు అనుమతి లేదని …

Read More »

పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురామ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం, జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. నెట్టెం శ్రీ రఘురామ్, జగ్గయ్యపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) తో కలిసి కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నెట్టెం శ్రీ రఘురామ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, …

Read More »

ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించాలి… : వేముల శ్రీనివాస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యలవాడగా పేరు ప్రఖ్యాతిగాంచిన ఎన్టీఆర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ పనితీరుపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీక్ష నిర్వహించాలని ఎన్.ఎస్.యు.ఐ. స్టేట్ కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి పరోక్షంగా జిల్లా నగర మండల విద్యాశాఖ అధికారులు సహకరిస్తున్నారు అని జిల్లాలో జరుగుతున్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలన్నారు. విద్యాహక్కు చట్టం 2009 సెక్షన్ 12 1 సి ప్రకారం …

Read More »

అనేక విద్యార్హతలు.. ఒకే విశ్వవిద్యాలయంతో సుదీర్ఘ అనుబంధం

-డాక్టర్ రవికుమార్ బొప్పనకు ఘన సత్కారం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పర్యాటక, ఆతిథ్య నిర్వహణ విభాగంలో బుధవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు హాజరై తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి డాక్టర్ రవికుమార్ బొప్పనను విభాగాధిపతి ప్రొఫెసర్ పి. పూర్ణచంద్రరావు, సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. డాక్టర్ రవికుమార్ బొప్పనకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో సుదీర్ఘమైన విద్యా …

Read More »

ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని పాట్ హోల్స్ కు మూడు రోజుల్లో మరమ్మతులు నిర్వహించి గుంటలను పూడ్చాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఇంజనీరింగ్ అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇప్పటికే నగరంలో రెండవ విడత పూడికతీత పనులు చాలా వరకు పూర్తయ్యాయని, ఇంకా ఏమైనా పూడికతీత పనులు మిగిలి ఉంటె సదరు ప్రాంతాలలో యుద్ద ప్రాతిపదికన …

Read More »

నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరాన్ని పచ్చదనంతో సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా డివైడర్లలో అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, పార్క్ విభాగాల అధికారులను ఆదేశించారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఇంజినీరింగ్, పార్క్ విభాగాల అధికారులు, కాంట్రాక్టర్లతో ప్లాంటేషన్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాంటేషన్ ని మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా, పిన్ పాయింట్ గా చేపట్టాలన్నారు. మొక్కల కోసం గోతులను ఇష్టానుసారం తవ్వకుండా డిగ్గింగ్ యంత్రాన్ని …

Read More »

ఆహార, తాగునీటి భద్రతపై శానిటరీ ఇన్స్పెక్టర్లు సమగ్ర అవగాహన కల్గి ఉండాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలు తీసుకునే ఆహార, తాగునీటి భద్రతపై శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు సమగ్ర అవగాహన కల్గి ఉండి, ప్రజారోగ్యానికి భంగం కల్గించే వాటిని అడ్డుకోవాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు అన్నారు. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో పరిశుభ్రమైన ఆహారం, త్రాగునీటిని ప్రజలకు అందించేందుకు వార్డ్ ల వారీగా శానిటరీ ఇన్స్పెక్టర్లు తగు పర్యవేక్షణ చేయడానికి వీలుగా వారికి బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రత్యేక …

Read More »

పెండింగ్ అభివృద్ది పనులు, మౌళిక వసతుల కల్పనపై సమగ్ర నివేదిక ఇవ్వాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని విలీన గ్రామాల్లో పెండింగ్ అభివృద్ది పనులు, మౌళిక వసతుల కల్పనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం చౌడవరం, జూనం చుండూరు, పొత్తూరు తదితర ప్రాంతాల్లోపర్యటించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర శివారు ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా, వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్లు, శ్మశానవాటికలపై వార్డ్ ల వారీగా సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. అలాగే …

Read More »