Breaking News

Daily Archives: October 9, 2026

బీసీలకు టీడీపీ అండగా ఉంటుంది…

-రెండేళ్లలో పోతుల చెంచయ్య–పాలేరు రిజర్వాయర్ పూర్తి చేస్తాం -కొండపి ‘మీ భూమి–మీ హక్కు’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొండపి, ప్రకాశం జిల్లా, నేటి పత్రిక ప్రజావార్త: బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ ద్వారా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బీసీలు టీడీపీకి వెన్నెముక వంటివారని, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. శుక్రవారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలోని నరిసింగోలులో నిర్వహించిన …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలి…

-కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ భాను ప్రకాష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ​ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాష్ ఆదేశించారు. ఉమ్మడి ​కృష్ణా-గుంటూరు మరియు తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి సన్నాహాక ఏర్పాటచలపై శుక్రవారం ఢిల్లీ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వర్చువల్ గా …

Read More »

రీసర్వే ప్రక్రియపై జెసిలు ప్రతి రోజు కలెక్టర్లు వారానికి ఒకసారి సమీక్షించాలి… : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భూములు రీసర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రగతిలో వెనుకబడిన మండలాల అధికారులతో జాయింట్ కలెక్టర్లు ప్రతి రోజు, జిల్లా కలెక్టర్లు వారానికి ఒకసారి టెలికాన్ఫరెన్స్ లేదా వీడియో కాన్ఫరెన్స్ లో ద్వారా సమీక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఎపి సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం భూముల రీసర్వే ప్రక్రియ వివిధ దశల్లో ఉందని ఈ ప్రక్రియను మరింత వేగవంతం …

Read More »

విజయవాడలో జోయాలుక్కాస్ ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభం

-అక్టోబర్ 25 వరకు వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన.. రూ.లక్షకు పైగా కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: ప్రముఖ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్ విజయవాడ షోరూమ్‌లో ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ శుక్రవారం (అక్టోబర్ 9) ప్రారంభమైంది. వజ్రాభరణాల కళాత్మకత, ప్రత్యేక డిజైన్లు, ఆధునిక ఆభరణాల సొబగులను ఒకే వేదికపై అందించాలనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రదర్శన అక్టోబర్ 25 వరకు కొనసాగనుంది. పెళ్లిళ్లకు ప్రత్యేకంగా రూపొందించిన అద్భుతమైన వజ్రాభరణాల సెట్ల …

Read More »

12 వేలకుపైగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన హెచ్‌సీజీ విజయవాడ

-ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రొమ్ము క్యాన్సర్ చికిత్సలో హెచ్‌సీజీ క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ విజయవాడ కీలక మైలురాయిని సాధించింది. ఇప్పటివరకు 12 వేలకుపైగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది. ప్రముఖ శస్త్ర చికిత్సా క్యాన్సర్ నిపుణుడు, ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ ఎం. గోపీచంద్ నాయకత్వంలో ఈ విజయాన్ని సాధించినట్లు వెల్లడించింది. రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా రొమ్మును పూర్తిగా తొలగించాల్సిన అవసరాన్ని తగ్గించే అవయవ సంరక్షణ …

Read More »

దుర్గామండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా

-గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు.. పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితం -విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి పండుగ సందర్భంగా దుర్గాదేవి మండపాలకు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు …

Read More »

సేవా సేతు అభియాన్ క్యాంపులకు విశేష స్పందన

-పీఎం సూర్య ఘర్ పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యం, ఏపీసీపీడీసీఎల్ పరిధిలో మూడు రోజుల్లో 11 వేలకు పైగా దరఖాస్తులు: సీఎండీ పి. పుల్లారెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా నిర్వహించిన “సేవా సేతు అభియాన్” క్యాంపులకు విశేష స్పందన లభించిందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని సబ్ డివిజన్, జిల్లా …

Read More »

దివ్యాంగులకు జాతీయ విదేశీ విద్యా ఉపకార వేతనం….

-డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన దివ్యాంగ విద్యార్థులు ఉన్నత విద్య కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ‘జాతీయ విదేశీ విద్యా ఉపకార వేతనం’ (NFPwD)ను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. ​భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారత విభాగం (Divyangjan) ద్వారా బెంచ్‌మార్క్ దివ్యాంగుల కోసం ఈ జాతీయ …

Read More »

గృహ నిర్మాణాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి…

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గృహ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించాలని …

Read More »

సంజీవని ఆరోగ్య సేవలను ప్రారంభించడానికి జిల్లాలు సర్వసన్నద్ధం కావాలి…

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న సంజీవని ఆరోగ్య సేవల అమలుకు జిల్లాలన్నీ సర్వసన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సమన్వయంతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన మౌలిక సదుపాయాలు, ఐటీ పరికరాలు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వర్చువల్‌ వైద్య సంప్రదింపుల గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్ల …

Read More »