Breaking News

దుర్గామండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా

-గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు.. పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచితం
-విద్యుత్ భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయదశమి పండుగ సందర్భంగా దుర్గాదేవి మండపాలకు ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
అనుమతి పొందిన దుర్గా మండపాల నిర్వాహకులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిర్దేశించిన పరిమితికి మించి విద్యుత్ లోడ్ అవసరమైతే సాధారణ తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.
మండపాల వద్ద విద్యుత్ భద్రతకు ప్రాధాన్యం
దుర్గా మండపాలకు విద్యుత్ సరఫరా చేసే ముందు అధికారులు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎండీ ఆదేశించారు. పండుగ సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
విద్యుత్ స్తంభాలు, తీగలకు దూరంగా మండపాలను ఏర్పాటు చేయాలని, మండపాల పైనుంచి విద్యుత్ తీగలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ అలంకరణల కోసం నాణ్యమైన వైర్లు, స్విచ్‌లు, ప్లగ్‌లను మాత్రమే వినియోగించాలని తెలిపారు. విద్యుత్ కనెక్షన్లు, అలంకరణల ఏర్పాటు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినా, వేలాడుతున్నా వాటిని తాకకుండా, వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. అటువంటి పరిస్థితులు ఎదురైతే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని లేదా 1912 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సీఎండీ పి. పుల్లారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడలో జోయాలుక్కాస్ ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభం

-అక్టోబర్ 25 వరకు వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన.. రూ.లక్షకు పైగా కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *