Breaking News

గృహ నిర్మాణాల లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి…

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహ నిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గృహ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మాణంలో ఉన్న ఇళ్ల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ, ఇంకా ప్రారంభం కాని ఇళ్ల పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. పనితీరు వెనుకబడిన జిల్లాలు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేశారు.

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన–గ్రామీణ్‌ 2.0 కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, శాశ్వత వెయిటింగ్‌ జాబితా పరిశీలన, అవసరమైన ధ్రువపత్రాల అప్‌లోడ్‌, నిర్దేశిత తనిఖీలను పూర్తి చేసి ఇళ్ల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారుల కోసం గ్రామాల వారీగా జాబితాలు సిద్ధం చేసి, ఇప్పటికే ఉన్న లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ప్రాధాన్యంగా వినియోగించాలని సూచించారు. అవసరమైన చోట ప్రైవేటు భూముల సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, అక్టోబర్‌ 17లోగా భూసేకరణ బడ్జెట్‌ అంచనాలను సమర్పించాలని ఆదేశించారు.

గృహ నిర్మాణ పనుల నాణ్యత, ఆర్థిక పురోగతి, లబ్ధిదారులకు అందుతున్న సహాయంపై అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో భూ కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెఫ్సిబా, జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడలో జోయాలుక్కాస్ ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభం

-అక్టోబర్ 25 వరకు వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన.. రూ.లక్షకు పైగా కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *