Breaking News

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలి…

-కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్ భాను ప్రకాష్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
​ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ భాను ప్రకాష్ ఆదేశించారు.

ఉమ్మడి ​కృష్ణా-గుంటూరు మరియు తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి సన్నాహాక ఏర్పాటచలపై శుక్రవారం ఢిల్లీ నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ వర్చువల్ గా పాల్గొనగా అదనపు ప్రధాన ఎన్నికల అధికారులు దిల్లీ రావు,వెంకటేశ్వర రావుతో పాటు ఉమ్మడి కృష్ణా గుంటూరు,తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమీషనర్ భాను ప్రకాష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రక్రియకు సంబంధించి ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి ఉపాధ్యాయుడు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు.ఐఈసీ కార్యకలాపాల ద్వారా ఓటరు నమోదు ప్రక్రియపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియలో అవలంబించాల్సిన విధానాలపై దిశా నిర్దేశం చేశారు. నిబంధనలకు అనుగుణంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించాలని ఆయన సూచించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

12 వేలకుపైగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన హెచ్‌సీజీ విజయవాడ

-ముందస్తు గుర్తింపు, ఆధునిక చికిత్సలతో మెరుగైన ఫలితాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రొమ్ము క్యాన్సర్ చికిత్సలో హెచ్‌సీజీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *