Breaking News

సంజీవని ఆరోగ్య సేవలను ప్రారంభించడానికి జిల్లాలు సర్వసన్నద్ధం కావాలి…

-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్న సంజీవని ఆరోగ్య సేవల అమలుకు జిల్లాలన్నీ సర్వసన్నద్దం కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి సమన్వయంతో కూడిన నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన మౌలిక సదుపాయాలు, ఐటీ పరికరాలు, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వర్చువల్‌ వైద్య సంప్రదింపుల గదులు ఏర్పాటు చేయాలని సూచించారు. పేషెంట్‌ కేర్‌ కోఆర్డినేటర్ల నియామకం,వైద్య సిబ్బందికి శిక్షణ,ఆరోగ్య కేంద్రాల నమోదు ప్రక్రియలను నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని, కలెక్టర్లు ప్రతి వారం పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు.

వైద్య సదుపాయాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. అలాగే మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు నీరు, ఆహారం ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. దోమల నివారణ చర్యలు, ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహణ, అవసరమైన ప్రాంతాల్లో క్రిమిసంహారక చర్యలు, దోమతెరల పంపిణీని సమర్థంగా అమలు చేయాలని తెలిపారు. తాగునీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, క్లోరినేషన్‌, నీటి నమూనాల పరీక్షలు, పైపులైన్ల లీకేజీల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రదరబాబు తో పాటు జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడలో జోయాలుక్కాస్ ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభం

-అక్టోబర్ 25 వరకు వజ్రాభరణాల ప్రత్యేక ప్రదర్శన.. రూ.లక్షకు పైగా కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *