-ఘటనకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీసిన మంత్రి దుర్గేష్
-ఘటనపై విచారణ చేయిస్తామని బాధ్యులపై తప్పక చర్యలు ఉంటాయని తెలిపిన మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, మధురపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయ టెర్మినల్ విస్తరణ పనుల్లో ప్రమాదం చోటుచేసుకున్న ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.
ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తో కలిసి ప్రమాద స్థలిని మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులపై అధికారులతో సమీక్షించి మంత్రి సంబంధిత వివరాలను ఆరా తీశారు..కొంత కాలంగా ఇక్కడ టెర్మినల్ విస్తరణ, పలు విభాగాల పనులు జరుగుతున్న నేపథ్యంలో మొదటి అంతస్తు పైకప్పు ఏర్పాటుచేస్తుండగా పైన ఉన్న గిర్డర్ల బోల్ట్ ను బిగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారని తెలిపారు. అదృష్టవశాత్తు ఘటనాస్థలంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు.. పని చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. భారీ నిర్మాణాలు చేపట్టడంలో ప్రణాళిక చేయడం ఒక ఎత్తైతే కార్యాచరణలో పెట్టడం మరొక పెద్ద సవాల్ అన్నారు.. ఎయిర్ పోర్ట్లో ఏదో పెద్ద ఘటన జరిగిందని బాహ్య ప్రపంచంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ఏదేమైనా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, ప్రమాదం పెద్దదై కార్మికుల ప్రాణాలు పోతే ఎవరూ వెనక్కి తీసుకురాలేని.. అందుకే ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు జాగ్రత్త చర్యలను పాటించాలన్నారు. ఈ విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడతామన్నారు.. ఈ ఘటనకు సంబంధించిన నివేదికను అధికారులతో తెప్పించుకొని ఏ విధంగా ముందుకెళ్లాలని అంశంపై ఆలోచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు..