-కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఓటర్ల దినోత్సవం ను పురస్కరించుకుని “ఓటింగ్ లాగా ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను ” అనే అంశంపై విద్యార్థులకి వ్యాస రచన, వక్తృత్వ పోటీలు ఎస్ కె వి టి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. వ్యాస రచన విభాగంలో కె హాసిని 7వ తరగతి శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్ , రాజమహేంద్రవరం (యు), ఎం వెంకట రేణుక , 8వ తరగతి, జి పి ఆర్ జెడ్పీ హై స్కూల్, బొమ్మూరు, రాజమహేంద్రవరం (ఆర్) , బి సాయి శ్రీనిజ 9 వ తరగతి మునిసిపల్ హై స్కూల్, లాలా చెరువు, రాజమహేంద్రవరం (యు) లు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచు కోవడం జరిగింది.
వక్తృత్వ పోటీలు విభాగంలో పి. తేజేశ్వని, ఎస్ కే వి టి, ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, రాజమహేంద్రవరం (యు) , వి ఇషిత కుమారి 8 వ తరగతి , శ్రీ గౌతమి స్మార్ట్ స్కూల్, రాజమహేంద్రవరం (యు), పి లీలా స్వాతి 9 వ తరగతి ఎస్పిపిపిఆర్ జెడ్పీ హై స్కూల్, పందలపాక లు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచు కోవడం జరిగింది.
Prajavartha Online Telugu News