Breaking News

త్వరలో రాజమండ్రిలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం…

-మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్లోని గ్లాడియేటర్ క్రికెట్ క్లబ్ లో లెజెండ్స్ కప్-2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎప్పుడూ రాజకీయ ప్రసంగాలతో, ప్రజలను కలుస్తూ బిజీ బిజీగా గడిపే మంత్రి దుర్గేష్ ఇవాళ క్రికెట్ బ్యాట్ చేతపట్టి కాసేపు యువతను, క్రీడాకారులను అలరించారు.తనదైన శైలిలో క్రికెట్ ఆడి పలువురిని ఆకర్షించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు, ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే
అద్భుతంగా రానిస్తారన్నారు. క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసేందుకు అనువైన స్థలం కేటాయించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా రాజమహేంద్రవరం ఉండటంతో క్రీడా సౌకర్యాలను కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రాజమండ్రి రూరల్, అర్బన్ స్థానిక శాసనసభ్యులు, జిల్లా మంత్రిగా తాను, కలెక్టర్, ఎస్పీలు అంతా టీమ్ గా ఏర్పడి యుద్ధప్రాతిపదికన రాజమహేంద్రవరంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. క్రీడల పట్ల మక్కువ కలిగిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తోన్నారన్నారు. ఇప్పటికే రూపకల్పన జరుగుతుందన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, క్రీడాస్ఫూర్తి అలవడుతుందన్నారు.క్రీడాస్ఫూర్తి ద్వారా విద్యార్థులు తమ నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను తేలికగా అధిగమించగలరని వివరించారు.క్రీడల్లో రాణిస్తే యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని పేర్కొన్నారు. నిరంతరం క్రీడా టోర్నమెంట్ లు నిర్వహిస్తూ క్రీడలను ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అభినందించారు. టోర్నమెంట్ లు ఏర్పాటు చేయడానికి డబ్బు ప్రధానం కాదని, చిత్తుశుద్ధి, సంకల్పబలం ముఖ్య కారణమని మంత్రి అన్నారు. 40 ఏళ్లు దాటిన వాళ్లకు సైతం దేహధారుడ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించడం వీరి ప్రత్యేకత అన్నారు. చదువుతో పాటు క్రీడాకారిణిగా అద్భుతమైన భవిష్యత్ ను ఆశిస్తూ ఆత్మవిశ్వాసంతో 10వ తరగతి చదువుతున్న అమ్మాయి క్రికెట్ లో తన భవిష్యత్ వెతుక్కోవడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మంత్రి అభినందించారు. కళలు, సంస్కృతి, సాంప్రదాయాల్లో రాజమహేంద్రవరానికి ఎంతపేరుందో అంతే స్థాయిలో క్రీడలకు సైతం రాజమహేంద్రవారానికి పేరుందన్నారు. ఒక్క క్రికెట్ అనే కాదు అనేక క్రీడల్లో ఇక్కడి వారు రాణించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రత్యేకించి ఇక్కడే పుట్టి రాణించిన పుట్ బాల్ క్రీడాకారుడు నింబస్, సుంకర భాస్కరరావు, చాముండేశ్వరి రాజా, భాస్కర్ నాథ్,ఆదిశేషు, అంతేగాక బాస్కెట్ బాల్ లో సైతం పలువురు రాణించారని గుర్తుచేశారు. ఎంతో మంది యువక్రీడాకారులను తయారుచేసి భారత క్రికెట్ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు అహర్నిశలు కృషి చేసిన క్రీడాకారులు ఎమ్మెస్కే ప్రసాద్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, ఆర్య కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ చల్లాశంకర్ రావు, అడిషనల్ ఎస్పీ, నిర్వాహకులు బాలాజీ, మురళీకృష్ణ, శ్రీనివాస్ చౌదరి, మాజీ రంజీట్రోఫీ ప్లేయర్ రమణ కిషోర్, కొండవీటి ప్రభాకర్, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి విస్తరించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *