Breaking News

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి బుధవారం ఉదయం గాయత్రి నగర్ లో ఉన్న VSN షాపింగ్ మాల్, వాల్ట్ బ్రేవరీ (పబ్), Max షో రూమ్, కోర షోరూమ్ మరియు పీటర్ ఇంగ్లాండ్ షోరూమ్ ఆకస్మిక తనిఖీ చేసారు. వి యం సి సిబ్బంది. ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా కాంప్లెక్స్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, ఎన్టీఆర్ కాంప్లెక్స్ వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *