Breaking News

వెటర్నరీ డాక్టర్ ధృవీకరించని ఏ జంతువును వధించకూడదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా బక్రీద్ పండుగను 07 జూన్, 2025న జరుపుకుంటారని పేర్కొనబడింది. బక్రీద్ పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో జంతువులను వధించే అవకాశం ఉన్న మాట వాస్తవం. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక (స్లాటర్ హౌస్) రూల్స్, 2001లోని రూల్ 3 ప్రకారం, చట్టం ప్రకారం అధికారం పొందిన సంబంధిత అథారిటీ ద్వారా గుర్తించబడిన లేదా లైసెన్స్ పొందిన స్లాటర్ హౌస్‌లో తప్ప, మునిసిపల్ ప్రాంతంలో ఏ వ్యక్తి ఏ జంతువును వధించకూడదు. పండుగ వేళ పశువధ నిర్వహించుకొనుటకు నగరపాలక సంస్థ కబేళా నందు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయుటతో పాటుగా అందుకు అవసరమైన అన్ని వసతులు మరియు సౌకర్యాలు కల్పించుట జరిగిందని వివరించారు. అదే విధంగా కబేళాకు అధిక మంది కాకుండా కేవలం ఒక జీవానికి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు మాత్రమే అనుమతి ఇవ్వటం జరుగునని పేర్కొన్నారు. గోహత్య నిషేధ చట్టం అమలులో ఉంది. దీని ప్రకారం ఆవులను చంపడం చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. గర్భం దాల్చిన ఆడ పశువులు, 3 నెలల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్నదూడలు, రెండు సంవత్సరాల లోబడి ఉండే మగ పశువులు, వధించడానికి తగిన స్థితిలో ఉందని వెటర్నరీ డాక్టర్ ధృవీకరించని ఏ జంతువును వధించకూడదు. నగరంలో బీఫ్ వ్యాపారాలు విధిగా పై సూచనలు పాటిస్తూ, అధికారులతో సహకరించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తమ యొక్క వ్యాపారాలు సాగించుకొనవలసినదిగా తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *