Breaking News

రేపు కొవ్వూరు లో సీఎం పర్యటన

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అమరావతిలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10. 00 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.45 గంటలకు మలకపల్లికి చేరుకోనున్నారు. 10.45 నుంచి 11.05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దే ఆయన నగదు పంపిణీ చేయనున్నారు. ఉదయం 11.10 నుంచి మ.12.40 వరకు గ్రామ సభలో పాల్గొని లబ్దిదారులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12.50 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం ఏ.ఎమ్.సికి ఆయన చేరుకుంటారు. తర్వాత 1. 30 గంటల నుంచి మ. 3.00 గంటల వరకు పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3.30 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు సీఎం చేరుకుని బెంగళూరు బయలుదేరి వెళ్తారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *