అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలలో సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి ఉద్యోగుల హామీలపై సీఎం ప్రకటన పై ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సీఎం క్యాంప్ ఆఫీసులో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ తరఫున మెమెంట్ ఇచ్చి సాలువతో సన్మానం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ అమరావతి రెవెన్యూ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్ర రాజు ధన్యవాదాలు తెలిపారు.
సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు…12వ PRC నియామకానికి అంగీకారం, 2 రెండు డిఎలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు, 1-7-2024, 1-1-2025 డీఏలు విడుదల, 2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్ వచ్చే సంక్రాంతికి అకౌంట్ లో వేయడానికి అంగీకారం, పోలీసులకు 1 అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు, అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం, 70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిని వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు, ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్. వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు చెల్లింపునకు అంగీకారం.
ఈ కార్యక్రమంలో అమరావతి రెవిన్యూ ఎంప్లాయిస్ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ సూరిపల్లి రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, రాటకొండ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు. మిరియాల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News