విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఆటోనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘శ్రీ ధన్వంతరి ఓరోఫేషియల్ అండ్ డెంటల్ క్లినిక్’ను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హాస్పటల్ లో అందుబాటులో ఉంచిన నూతన, ఆధునిక వైద్య పరికరాలను ఆయన పరిశీలించారు. రోగులకు అందించే వివిధ రకాల వైద్య సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ డెంటల్ కళాశాలలో అత్యంత ప్రతిభ కనబరిచి ఉ ఉత్తమ విద్యనభ్యసించిన వైద్యులు డాక్టర్ హేమ శిల్ప, డాక్టర్ రమాదేవిలు సంయుక్తంగా ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆస్పత్రికి వైద్య రంగానికి ఆద్యుడైన ధన్వంతరి పేరు పెట్టడం ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. ఎక్స్-రే, పంటి ఇంప్లాంట్స్, పళ్ల తయారీతో పాటు పూర్తిస్థాయి అధునాతన పరికరాలు ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దంత సమస్యలే కాకుండా నోటి అల్సర్లు, క్యాన్సర్ సంకేతాలు, దవడ నొప్పులు వంటి అనేక సమస్యలకు అనుభవజ్ఞులైన వైద్యులతో చికిత్స అందించడం స్థానికులకు ఎంతో మేలు చేస్తుందని, ప్రజలందరూ ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఆస్పత్రి నిర్వాహక వైద్యులు డాక్టర్ హేమ శిల్ప, డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ.. నోటి మంట, నోరు తెరవలేకపోవడం, దవడల వద్ద శబ్దాలు రావడం, తల, మెడ నొప్పులతో పాటు నోటి క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలకు మరియు అన్ని రకాల దంత సమస్యలకు ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News