Breaking News

NTR భరోసా పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి…

-జిల్లా కలెక్టర్, Dr S. వెంకటేశ్వర్.
-07.09.2026 నుండి 16.09.2026 వరకు స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాల సంక్షేమం, సామాజిక భద్రత మరియు గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అమలు చేస్తున్న NTR భరోసా పింఛను పథకం కింద కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన Memo No.3407491/RD.I/A1/2026, dated 06.09.2026 ప్రకారం, కొత్త NTR భరోసా పింఛను దరఖాస్తుల స్వీకరణ మరియు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం 07.09.2026 నుండి 16.09.2026 వరకు కొనసాగుతుంది. అర్హులైన ప్రజలు తమకు సంబంధించిన స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు కార్యాలయంలో నిర్ణీత నమూనాలో దరఖాస్తు సమర్పించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

పింఛను కేటగిరీలు

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన వారు క్రింది కేటగిరీల కింద దరఖాస్తు చేసుకోవచ్చు:

1. వృద్ధాప్య పింఛను (Old Age Pension)
2. వితంతు పింఛను (Widow Pension)
3. ఒంటరి మహిళల పింఛను (Single Women Pension)
4. దివ్యాంగుల పింఛను (Disabled Pension)
5. నేత కార్మికుల పింఛను (Weavers)
6. మత్స్యకారుల పింఛను (Fishermen)
7. డప్పు కళాకారుల పింఛను (Dappu Artists)
8. సంప్రదాయ చెప్పుల తయారీదారుల పింఛను (Traditional Cobblers)
9. కల్లు గీత కార్మికుల పింఛను (Taddy Tappers)
10. ట్రాన్స్‌జెండర్ పింఛను (Transgender)

కొత్త పింఛన్లు ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా కేటగిరీల వారీగా దశలవారీగా మంజూరు చేయబడతాయి.

♦️*దరఖాస్తుతో సమర్పించాల్సిన పత్రాలు*

అన్ని కేటగిరీలకు సాధారణంగా:

– ఆధార్ కార్డు
– రైస్ కార్డు / ఆదాయ ధృవీకరణ పత్రం
– సంబంధిత పింఛను కేటగిరీకి అవసరమైన ధృవీకరణ పత్రాలు

సమర్పించాలి.

కేటగిరీ వారీగా అవసరమైన ముఖ్యమైన పత్రాలు:

– వృద్ధాప్య పింఛను: వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డు
– వితంతు పింఛను: భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆధార్ నంబర్
– ఒంటరి మహిళ: వివాహిత అయితే కోర్టు/అదాలత్ విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసిన Non-Marriage Certificate
– దివ్యాంగులు: 40% లేదా అంతకంటే ఎక్కువ Benchmark Disability కలిగిన SADAREM సర్టిఫికెట్
– నేత కార్మికులు: హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్ శాఖ ధృవీకరణ పత్రం
– మత్స్యకారులు: మత్స్యశాఖ ధృవీకరణ పత్రం
– డప్పు కళాకారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రం
– సంప్రదాయ చెప్పుల తయారీదారులు:y సాంఘిక సంక్షేమ శాఖ ధృవీకరణ పత్రం
– కల్లు గీత కార్మికులు: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ధృవీకరణ పత్రం
– ట్రాన్స్‌జెండర్లు: జిల్లా మెడికల్ బోర్డు ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ప్రక్రియ

అర్హులైన అభ్యర్థులు సంబంధిత స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు కార్యాలయంలో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో సమర్పించాలి.

దరఖాస్తులను సంబంధిత డిజిటల్ అసిస్టెంట్ / WEDPS స్వీకరించి, ప్రాథమిక వివరాలను పరిశీలించి, ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. దరఖాస్తు విజయవంతంగా రిజిస్టర్ అయిన తరువాత System Generated Acknowledgement దరఖాస్తుదారునికి అందజేయబడుతుంది. దరఖాస్తు వివరాలు e-KYC వివరాలతో కూడా ధృవీకరించబడతాయి.

ప్రాథమిక అర్హత పరిశీలనలో అర్హత సాధించిన దరఖాస్తులకు సంబంధిత అధికారులు Physical Verification నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారుడి అర్హత, సమర్పించిన పత్రాలు మరియు సంబంధిత వివరాలను పరిశీలిస్తారు.

అర్హత పరిశీలన మరియు తుది మంజూరు

భౌతిక పరిశీలన అనంతరం సంబంధిత అధికారుల ద్వారా దరఖాస్తుల పరిశీలన మరియు సిఫార్సు జరుగుతుంది.

MPDO / Municipal Commissioner పింఛను మంజూరు చేయరు; అర్హులైన దరఖాస్తులను మాత్రమే సిఫార్సు చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో SGSW, RTGS మరియు SERP ద్వారా తుది పరిశీలన జరుగుతుంది.

పింఛన్ల మంజూరు మరియు విడుదల ప్రభుత్వ అనుమతి మరియు బడ్జెట్ అందుబాటుకు లోబడి ఉంటుంది. పింఛను దరఖాస్తు చేసిన తేదీ నుంచి వెనుకబడిన కాలానికి కాకుండా, SERP ద్వారా పింఛను మంజూరు చేసి విడుదల/ఎనేబుల్ చేసిన నెల నుంచి మాత్రమే చెల్లించబడుతుంది.

జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి

తిరుపతి జిల్లాలో NTR భరోసా పింఛన్లకు అర్హత కలిగిన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 07.09.2026 నుండి 16.09.2026లోపు సంబంధిత స్వర్ణ గ్రామ / స్వర్ణ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ విజ్ఞప్తి చేశారు.

దరఖాస్తుదారులు అవసరమైన అన్ని పత్రాలను వెంట తీసుకురావాలని, సరైన మరియు వాస్తవమైన వివరాలను మాత్రమే సమర్పించాలని ఆయన సూచించారు.

అర్హులైన ప్రతి వ్యక్తికి ప్రభుత్వ సంక్షేమ పథకం ప్రయోజనం పారదర్శకంగా మరియు నిబంధనల ప్రకారం అందేలా జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *