Breaking News

తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ కి డా. పసుపులేటి హరిప్రసాద్ శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి నగర అభివృద్ధి, ప్రజలకు అందుతున్న మున్సిపల్ సేవలు, నగరంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారిద్దరూ స్నేహపూర్వక వాతావరణంలో మాట్లాడుకున్నారు. అనంతరం కమిషనర్ జయకృష్ణ ఐఏఎస్ తో డా. పసుపులేటి హరిప్రసాద్ కొంతసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆనంద్, తిరుపతి నగర వార్డు ఇన్‌చార్జి భరత్ భూషణ్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *