విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన లైబ్రరీ భవనాన్ని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ప్రారంభోత్సవం చేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి తెలిపారు. 2019 సంవత్సరం భారత ప్రభుత్వం సహకారంతో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో భాగంగా 2.32 కోట్ల రూపాయలతో కళాశాలలో నూతన లైబ్రరీ భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసామని తెలిపారు. ఈ నూతన భవనం లో లైబ్రరీ, రీడింగ్ హాల్ మరియు కాంపిటేటివ్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ఎస్ఆర్ఆర్ కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బి ఆర్ టి ఎస్ రోడ్ లో ఉన్న కళాశాల స్థలాన్ని కాపాడుతామని, అంతేకాకుండా ఫినిషింగ్ వేయించి కళాశాల పేరుతో ఉన్న బోర్డులు కూడా వారం రోజుల్లో ఏపిస్తానని మరియు ఫుట్ పాత్ వంతెన కూడా నిర్మిస్తానని శాసనసభ్యులు హామీ ఇచ్చారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఎం పద్మనాభం కి మరియు తెలుగు అధ్యాపకులు డాక్టర్ కె ఆర్ జి శేషు కుమార్ కి ఎమ్మెల్యే సన్మానం చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపల్ ఎం. పద్మనాభం, పిడి డాక్టర్ యుగంధర్, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ నాగేశ్వరరావు జిల్లా టూరిజం అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, డాక్టర్ శేషు కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ ఎన్ రాయన్న, కాంట్రాక్టర్ కే కృష్ణంరాజు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News