Breaking News

మానసిక ఒత్తిడి రహిత జీవనమే సంపూర్ణ ఆరోగ్యం

-విజయవంతంగా మానసిక ఆరోగ్య అవగాహన, శిక్షణ కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి సమాజంలో తీవ్రమవుతున్న మానసిక ఒత్తిళ్లను జయించడానికి ప్రణాళికాబద్ధమైన జీవనశైలి, సమయపాలన అత్యంత అవసరమని ప్రముఖ మానసిక నిపుణులు అభిప్రాయపడ్డారు.
గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికార యంత్రాంగం మానవ అభివృద్ధి సెల్ ఆధ్వర్యంలో ఆకర్ష ఫౌండేషన్ భాగస్వామ్యంతో జరిగిన స్ట్రెస్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో స్వర్ణ వార్డు కార్యదర్శులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్త నవితాశ్రీ.. దాదాపు 25 నిమిషాల పాటు ‘జాకబ్సన్ రిలాక్సేషన్’, ‘హిప్నోటిక్ రిలాక్సేషన్’, యోగా, ధ్యాన విధానాలపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చారు. సమయపాలన పాటిస్తే ఒత్తిడి లేకుండా పనిసామర్థ్యాన్ని మరింత పెంచుకోవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమానంతరం మానసిక ఆరోగ్య రంగానికి నవితాశ్రీ అందిస్తున్న సేవలకు గాను డాక్టర్ గర్రే శంకరరావు, డాక్టర్ టి.ఎస్. రావు, జగదీష్, నోడల్ ఆఫీసర్ జి. జ్యోతి ఆమెను సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *