Breaking News

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి
-ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి
-కలెక్టర్ల సదస్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూములకు సంబంధించి స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను తయారు చేయాలని రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చ సందర్భంగా వేర్వేరు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉండిపోతున్న భూముల్ని గుర్తించి వాటి వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు. రీసర్వే పూర్తయ్యాక ప్రభుత్వ భూములపై పూర్తి స్పష్టత వస్తుందని సీఎం అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల వద్ద ఏళ్లుగా వినియోగం లేని భూముల్ని గుర్తించాలన్నారు. వాటి వివరాలను కామన్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్ కిందకు తీసుకు రావాలన్నారు. జిల్లాలు, శాఖల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను నమోదు చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ ప్రభుత్వ శాఖకు భూమి అవసరమైనా ఈ పోర్టల్ ద్వారా కేటాయించే పరిస్థితి ఉండాలని అన్నారు. భూమి కొరత అభివృద్ధికి అడ్డంకి కాకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టు మంజూరు అయిన తర్వాత భూమి కోసం వెతకకుండా ముందుగానే పారిశ్రామిక, అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూమిని గుర్తించాలని సూచించారు.

మూడు నెలల కార్యాచరణ ముందుగానే

ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా కలెక్టర్ స్పష్టమైన యాక్షన్ క్యాలెండర్ ను రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలన్నారు. కలెక్టర్ల సదస్సు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలను సాధించేలా ఉండాలన్నారు. జిల్లాల అధిపతులుగా కలెక్టర్లు అన్ని శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై 360 డిగ్రీల కోణంలో దృష్టి సారించాలని అన్నారు. శాఖల మధ్య ప్రభావితం అయ్యే పనుల్ని కలెక్టర్ పరిష్కరించాలన్నారు. సమస్యల్ని ప్రస్తావించటం ఒక్కటే కాకుండా పరిష్కారం చూపేలా కలెక్టర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బాధ్యతను మరొకరికి బదిలీచేసే తత్వాన్ని విడనాడాలన్నారు. ముఖ్యమంత్రిగా తాను మూడు నెలల కార్యక్రమాలను ముందే నిర్దేశించుకుంటా నని వెల్లడించారు. ప్రతీ నెలా ఎస్ఐపీబీ సమావేశాలతో పాటు ప్రతీ 15 రోజులకూ కేబినెట్ సమావేశంతో పాటు ప్రతీ మూడు నెలలకూ కలెక్టర్ల సదస్సు, ప్రతీ నెలా 4 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్తున్నానని అన్నారు. సీఎంగా తనపై కేంద్ర ప్రభుత్వం కూడా ఉంటుందని దానికి అనుగుణంగానే ప్రణాళిక చేసుకుంటున్నట్టు సీఎం కలెక్టర్లకు వివరించారు. కాలాన్ని సద్వినియోగం చేసుకునేలా కలెక్టర్లు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్ణయాల్లోనూ ఎస్కేపిజం కుదరదని రియాక్టివ్ గవర్నెన్స్ కంటే ప్రోయాక్టివ్ గవర్నెన్సుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

యాక్షన్ టేకెన్ రిపోర్టు పై దిశానిర్దేశం

ఎస్సీ వర్గాలకు ఇచ్చే ప్రయోజనాలను బుడగ జంగాలకు పొడిగించే అంశంపై తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించే అంశం పెండింగులో ఉన్న నేపథ్యంలో ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను వారికీ అందించాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ పరిశ్రమలతో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని అనుసంధానించాలని అన్నారు. కరిక్యులమ్, పరికరాలు తదితర అంశాలను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మంజూరైన గృహాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. అదనంగా మంజూరు అయ్యే గృహాలను దశలవారీగా అమలు చేయాలని సీఎం నిర్దేశించారు. త్వరలోనే మరో 1.5 లక్షల గృహాలు ఏపీకి అదనంగా మంజూరు అయ్యే అవకాశం ఉందని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో తాగునీటి సరఫరా విషయంలో అత్యవసర పనుల్ని వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. రాష్ట్రంలో 50 శాతం హరిత ప్రాంతాన్ని సాధించేలా ప్లాంటేషన్ సీజన్ కు ముందే అవసరమైన 20 కోట్ల విత్తనాలను, మొక్కల్ని సిద్ధం చేసుకోవాలన్నారు. తక్కువ నీటి అవసరం ఉన్న మొక్కల్ని ప్రోత్సహించాలని నీటి సంరక్షణా పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ విధానంలో సాగు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 905 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రంతో మాట్లాడాలని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *