Breaking News

జగనన్న పాలవెల్లువ పథకాన్ని మహిళా పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా కలెక్టర్ జె.నివాస్

-జిల్లాలో 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున స్వల్పకాలిక రుణాలు అందించాం…

ఏ. కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో జగన్ అన్న పాలకొల్లు పథకం కింద 700 మంది మహిళా పాడి రైతులకు 30 వేల రూపాయల చొప్పున వర్కింగ్ క్యాపిటల్ గా స్వల్పకాలిక రుణాలు అందించామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. ఏ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలో జగనన్న పాల వెల్లువ పథకంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో కలెక్టర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ ప్రైవేటు డైరీల దోపిడీ నుండి పాడి రైతులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమంలో పాలు అందించే పాడి రైతులకు మంచి ధర అందించడంతోపాటు, స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని జగనన్న పాలవెల్లువ పధకంలో 1800 మంది పాడిరైతులను గుర్తించామని, వీరిలో 700 మందికి 30 వేల రూపాయల చొప్పున వర్కింగ్ కాపిటల్ గా స్వల్పకలోక రుణాలు అందించమన్నారు. దీర్ఘకాలంలో పాలు అందించేవారికి లక్ష రూపాయలు చొప్పున దీర్ఘకాలిక రుణాలు అందిస్తామన్నారు. అంతేకాక పాడి పశువులకు పోషకాలతో కూడిన దాణాను అతి తక్కువ ధరకు అందిస్తున్నామని, దీనితోపాటు సచివాలయ వారీగా పశు వైద్య శిబిరాలు నిర్వహించి ఉచుట వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఇన్ని ప్రయోజనాలున్న జగనన్న పాలవెల్లువ పథకాన్ని మహిళా పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో మహిళా పాడి రైతుల ఆర్ధికాభివృద్దికోసం అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ కార్యక్రమంనకు ప్రారంభం నుండీ మంచి స్పందన వచ్చిందన్నారు. జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా పాడి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా సమావేశాలు ఏర్పాటుచేసి వివరించాలన్నారు. సమావేశానికి ప్రతీ పాడి రైతు హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రైవేట్ డైరీల పాల సేకరణ కేంద్రంలో కన్నా, జగనన్న పాల వెల్లువ పాల సేకరణ కేంద్రంలో వెన్న శాతం ఎక్కువగా నమోదు అవుతున్నదని పాడి రైతులు గుర్తించారన్నారు. జగనన్న పాల వెల్లువ పధకంలో గ్రామ మహిళా డైరీ అసోసియేషన్ ఏర్పాటు సహకార సంఘాల మాదిరిగా ఏర్పాటు కావాలన్నారు. ఈ సంఘంలో సభ్యులు సంఘం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసే వారై ఉండాలన్నారు. పాల సేకరణ కోసం నియమింపబడే రూట్ ఇంచార్జ్ లు, ప్రమోటర్లు, గ్రామ సంఘ కార్యదర్సులు, సహాయ కార్యదర్సులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. సంఘ కార్యదర్శి పాల సేకరణకు సంబందించిన ప్రతీ అంశాన్ని రిజిస్టర్ లోను, ఆన్లైన్ లో నమోదు చేయవలసి ఉంటుందన్నారు. జగనన్న పాలవెల్లువ పధకం విజయవంతంలో ప్రమోటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తారని మహిళా డైరీ అసోసియేషన్ కేంద్రం లో ప్రమోటర్లుగా నియమించబడే వాళ్ళ ఎంపికలో ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుందన్నారు. నిరంతరం కేంద్రానికి పాలు సరఫరా చేసేవారు, కేంద్రం అభివృద్ధికి కృషి చేసేవారిని ప్రమోటర్లుగా ఎంపిక చేయాలన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి నాడు-నేడు కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ జె.నివాస్ పరిశీలించారు. కార్యక్రమంలో తహసిల్దార్ ఎం. వీరంజనేయప్రసాద్, ఎంపిడిఓ పశుసంవర్ధక శాఖ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *