Breaking News

ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నిధులను సద్వినియోగం చేసుకోవాలి !!

– రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్

ఉయ్యూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని మహిళలకు అండగా నిలుస్తూ, వారిని ఆర్ధికంగా చేయూతను ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న ఆసరా నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి,పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పేర్కొన్నారు. గురువారం ఆయన కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మానఫలం ఆకునూరు జిల్లా పరిషత ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో నాలుగో విడత వైయస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొని డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్దిని అందించారు. ఉయ్యూరు మండలంలో 768 స్వయం సహాయక సంఘాలలో 7, 577 మంది సభ్యులు ఉంటే వీరికి 25 కోట్ల 40 లక్షల 11 వేల 746 రూపాయలు నిధులు జమ కాగా, నేడు ఆకునూరు గ్రామంలో 76 స్వయం సహాయక సంఘాల లోని 766 మంది సబ్యులకు ఇప్పటివరకు 3 కోట్ల 51 లక్షల 19 వేల 087 రూపాయలు, చిన ఓగిరాల గ్రామంలో 69 స్వయం సహాయక సంఘాలలోని 683 మంది సబ్యులకు ఇప్పటివరకు పొదుపు మహిళా సంఘాలకు 2 కోట్ల 10 లక్షల 36 వేల 068 రూపాయలు, పెద ఓగిరాల గ్రామంలో 72 స్వయం సహాయక సంఘాలలోని 723 మంది సబ్యులకు ఇప్పటివరకు 2 కోట్ల 66 లక్షల 368 రూపాయలు, అలాగే గండిగుంట గ్రామంలో 114 స్వయం సహాయక సంఘాలలోని 1,124 మంది సబ్యులకు ఇప్పటివరకు 4 కోట్ల 20 లక్షల 91 వేల 128 రూపాయల నిధులకు సంబంధించిన చెక్కులను మంత్రి జోగి రమేష్ పంపిణీ చేశారు. తొలుత గండిగుంట గ్రామానికి చెందిన గూడవల్లి జెస్సిరాణీ, ఆకునూరు గ్రామానికి చెందిన కొడాలి పార్వతి జగన్ మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం, అభివృద్ధి గూర్చి చెబుతూ, స్వయం సహాయక సంఘాల ద్వారా తాము పొందిన ప్రగతిని వివరించారు. మహిళల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కనబరుస్తున్న గతంలో తామెన్నడూ చూడలేదని కనుక వైసీపీకి మహిళలు అంతా మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, వైయస్సార్ ఆసరా పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల ఆర్ధిక పురోగతికి దోహదపడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయం ద్వారా మనం ఆర్థికంగా అభివృద్ధి చెంది మన కుటుంబాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ పథకంను తీసుకొని రావడం జరిగిందని వివరించారు. ప్రభుత్వం చేపట్టే విధానాల్లో ఇంటిల్లిపాదిని శక్తివంతులుగా చేసే ప్రయత్నంలో భాగమే ఇదని, మహిళలను ఆర్ధికంగా ఎదిగేందుకు అనేక రూపేణా ఆర్ధిక సహాయాన్ని అందిస్తూ, ఇంటిలో యజమానురాలుగా మిమ్మల్ని నిలబెట్టేలా చేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించాలన్నారు. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మంత్రి జోగి రమేష్ కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు మహిళలకే లబ్ధిచేకూరేలా ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఒక మహిళ బాగుంటే ఇంటిల్లపాది ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఈ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని, అటువంటి మహిళలు పేదరికం నుండి సమాజంలో గౌరవంగా తిరిగేలా ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.ఓటర్లను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేయడం లేదని, 8వ తరగతి విద్యార్ధులకు అమ్మఒడి, ట్యాబులు పంపిణీ, నాడు నేడుతో విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చిన సంగతిని ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ గుర్తుచేసారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మండల ఎంపీపీ చీలి కల్పన, వైస్ ఎంపీపీ గంజి స్వర్ణ కుమారి, చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ రాజులపాటి రామచంద్రరావు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వల్లభనేని వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ జంపాన కొండలరావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు,ఆకునూరు, చిన ఓగిరాల, పెద ఓగిరాల, గండిగుంట గ్రామాల సర్పంచులు, ఎంపీడీవో ఉమాదేవి , తాసిల్దారు మస్తాన్ , వెలుగు సిబ్బంది, వివిధ శాఖల మండల అధికారులు,పెద్ద సంఖ్యలో పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *