విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ సమైక్యతను మరియు సమగ్రతను చాటిచెప్పిన స్వాతంత్య్ర సమరయోధుడు, ఉక్కుమనిషి, దేశ ఐక్యతా వాది మరియు భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ది.31.10.2024వ తేదీన జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్) సందర్భంగా ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి సిటీ ఆర్మడ్ గ్రౌండ్స్ వరకు సమైక్యతా రన్ ను నిర్వహించడం జరిగింది.
ఈ సమైక్యతా రన్ ను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. బెంజ్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ రన్ లో డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్., ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసద్, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది మరియు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు జాతీయ జెండాలను మరియు వివిధ రకాల ప్లకార్డ్ ద్వారా జాతీయ సమైక్యతను తెలియజేస్తూ సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్స్ వరకు ఈ రన్ సాగింది.
అనంతరం సిటీ ఆర్మడ్ రిజర్వ్ గ్రౌండ్స్ నందు అందరితో కలిసి నగర పోలీస్ కమీషనర్ అందరితో “దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక, ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్పూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక, నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటునందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను.” అని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ తోపాటు డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్., ఏ.బి.టి.ఎస్.ఉదయరాణి ఐ.పి.ఎస్., కృష్ణమూర్తి నాయుడు, ఎస్.వి.డి.ప్రసద్, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు పోలీస్ సిబ్బంది మరియు కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.