Breaking News

Tag Archives: delhi

అమెరికా భారతీయ ఎగుమతులపై అదనంగా 25% సుంకం విధించగా, రంగాలపై ప్రభావంపై FIEO ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యూహాత్మక చర్యలు మరియు మద్దతు కోసం ప్రభుత్వాన్ని కోరింది : అధ్యక్షుడు, FIEO

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (FIEO) అమెరికా ప్రభుత్వం భారత మూలం గల వస్తువులపై అదనంగా 25% సుంకం విధించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో అనేక ఎగుమతి విభాగాలపై మొత్తం సుంకాలు 50% వరకు పెరుగుతున్నాయి. ఈ నిబంధన 2025 ఆగస్టు 27 నుండి అమలులోకి వస్తుంది. ఈ చర్య భారతీయ వస్తువుల ప్రవాహాన్ని అమెరికా – భారత అతిపెద్ద ఎగుమతి మార్కెట్ – వైపు తీవ్రంగా దెబ్బతీస్తుంది. FIEO అధ్యక్షుడు ఎస్.సి. రల్హాన్ …

Read More »

అబద్ధపు ప్రచారాలను ఐటీ వింగ్ సమర్థవంతంగా తిప్పికొట్టాలి… : ఎంపీ గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ఢిల్లీలో నిర్వహించిన “మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ వేదికగా జరిగే అబద్దపు ప్రచారాలను ఢిల్లీ ఐటీ వింగ్ సమర్థవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఐటీకి సృష్టికర్తలం తామే అని కొందరు ప్రచారం చేసుకొంటున్నారని, కాని వాస్తవానికి ఐటీలో లక్షలాది మందికి ఉపాధి కల్పించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిదని గుర్తు చేశారు. కూటమి …

Read More »

పి.ఎమ్-జి.యు.జి.ఎ ప‌థ‌కం కింద కొత్త గ్రామాల సంఖ్యను పెంచే ప్రణాళికలు లేవు

-వాల్మీకి బోయ కమ్యూనిటీకి గుర్తింపు ప్రతిపాదనకు ఓ.ఆర్.జి.ఐ మద్దతు ఇవ్వ‌లేదు -కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ‌ స‌హాయమంత్రి దుర్గాదాస్ ఉయికె వెల్ల‌డి -పి.ఎమ్-జి.యు.జి.ఎ ప‌థ‌కం పురోగ‌తి పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎంపీ జి.ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన్ మంత్రి జనజాతీయ గ్రామ అభియాన్ (PM-JUGA) కింద గ్రామాల సంఖ్యను పెంచే ప్రణాళికలు ప్రస్తుతం లేవు. వాల్మీకి బోయ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ ట్రైబ్ హోదా కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. 2017లో TCR&TI చేసిన అధ్యయనం …

Read More »

కాలుష్య నియంత్రణపై వెనకడుగు ఎందుకు… లోక్ సభలో ఎంపీ గురుమూర్తి ప్రశ్న

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలలో సల్ఫర్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించేందుకు ఉద్దేశించబడిన ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్ల ఏర్పాటు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి ఈరోజు లోక్‌సభలో ప్రశ్నించారు. ఈ నిర్ణయం ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నకు కేంద్ర విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ స్పందించారు. 2015లో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ …

Read More »

భారత అణుశక్తి మిషన్ పురోగతిపై వివరాలు కోరిన తిరుపతి ఎంపి గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న అణు రియాక్టర్ల పరిశోధన, అభివృద్ధి గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో ముఖ్యమైన సమాచారాన్ని కోరారు. 2025-26 బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లతో ప్రకటించిన అణుశక్తి కార్యక్రమం ప్రస్తుత స్థితి, అలాగే తిరుపతి జిల్లాలోని ప్రముఖ విద్యా సంస్థలను ఈ పరిశోధనలో భాగం చేసే ఆలోచన ఉందా అని ఆయన ప్రశ్నించారు. ప్రాంతాలవారీగా భాగస్వామ్యం, అలాగే 2033 నాటికి దేశీయంగా అభివృద్ధి చేసే చిన్న అణు రియాక్టర్లను ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించే అవకాశం …

Read More »

తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నుముక : ఎంపీ కేశినేని శివనాథ్

-జాతీయ బీసి సంక్షేమ సంఘం నిర్వ‌హించిన సెమినార్ కి సంఘీభావం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నుముక అని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ తెలిపారు. జాతీయస్థాయిలో హక్కుల సాధన కోసం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని ఆంద్ర‌ప్ర‌దేశ్ భ‌వ‌న్ లో మంగళవారం జరిగిన సెమినార్ లో ఎంపీ కేశినేని శివ‌నాథ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ ను జాతీయ బిసి సంక్షేమ సంఘం నాయ‌కులు శాలువాతో స‌త్క‌రించారు. విజ‌య‌వాడ పార్లమెంట్ …

Read More »

ఏపీలో 4 ఐ.సి.ఎ.ఆర్ ఆమోదం పొందిన ప్రైవేట్ వ్యవసాయ కళాశాలలు

-కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు స్థాపించాలన్న ప్రణాళికలు లేవు -కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ స‌హాయ‌ మంత్రి భగీరథ్ చౌదరి వెల్ల‌డి -దేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు , కళాశాలల పై ప్ర‌శ్నించిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్ర‌భుత్వానికి కొత్త కేంద్ర‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల ఏర్పాటు విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళిక లేక‌పోయినా, ఇప్పటికే ఉన్న విశ్వవిద్యాలయాలకు నిధులు పెంచుతూ, పరిశోధన, బోధన రంగాలను బలోపేతం చేస్తోంద‌ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ స‌హాయ మంత్రి …

Read More »

సహజ వ్యవసాయంలో దేశీయ గోవుల పాత్ర, పార్లమెంటులో ఎంపీ గురుమూర్తి ప్రస్తావన

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశీయ ఆవుల లభ్యతపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో సహజ పద్ధతులు పెరుగుతున్న వేళ, దేశీ ఆవుల కొరత రైతులకు పెద్ద అడ్డంకిగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, దేశీ ఆవు జాతుల సంరక్షణ, అభివృద్ధి, పెంపకానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై సమాచారం కోరారు. అలాగే, రైతులకు దేశీ ఆవుల పెంపకం కోసం అందిస్తున్న ప్రోత్సాహకాలు, గత మూడు సంవత్సరాల్లో లబ్ధిదారుల వివరాలు, …

Read More »

ఏపీ పర్యాటక, సాంస్కృతిక అభివృద్ధికి కేంద్రం హామీ

-న్యూఢిల్లీ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర పర్యాటక అదనపు కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ సుమన్ బిల్లా లతో మంత్రి కందుల దుర్గేష్ భేటీ -ఏపీలో దాదాపు రూ.270 కోట్ల విలువైన మూడు పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్ లు సమర్పించిన మంత్రి దుర్గేష్ -రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల పలు ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ -రాష్ట్రానికి పలు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేసినందుకు కేంద్ర …

Read More »

శేషాచల అరుదైన జంతు జాతుల పరిరక్షణపై పార్లమెంటులో ప్రస్తావన

-అటవీ భూముల ఆక్రమణలపై ఎంపీ గురుమూర్తి ఆందోళన ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : శేషాచల జీవవైవిధ్య అభయారణ్యంలో అంతరించిపోతున్న మూషిక జింక, బంగారు బల్లి, దేవాంగ పిల్లి, రంగుల ఉడుత, పసుపు గొంతు పిగిలి పిట్ట వంటి అరుదైన జంతు జాతుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పార్లమెంటులో అడిగారు. అలాగే ఈ జంతువుల సంఖ్య పెరిగేందుకు చేపడుతున్న పరిశోధనలు, పర్యవేక్షణ కార్యక్రమాలు, అభయారణ్య అభివృద్ధిపై వివరాలు కోరారు. వన్యప్రాణుల రక్షణ, వేటగాళ్ల …

Read More »