Breaking News

Tag Archives: delhi

కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం చంద్రబాబు భేటీ

-అమరావతిలో బ్యాడ్మింటన్, వాటర్ స్పోర్ట్స్ హబ్ -తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరిన సీఎం -రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎకో సిస్టం ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ది కోసం చేపట్టాల్సిన …

Read More »

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి నివేదిక విడుదల

-సీఎం చంద్రబాబుకు నివేదిక అందించిన టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ -రాష్ట్ర అభివృద్ధికి, విజన్ 2047 సాధనకు 120 సిఫార్సులు చేసిన టాస్క్ ఫోర్సు -రాష్ట్రంలో పెట్టుబడులకు ఎస్కార్టు సర్వీసు అందిస్తున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు -సిలికాన్ వ్యాలీలాగే అమరావతి దేశానికి క్వాంటం వ్యాలీ అవుతుందన్న సీఎం -జాతి నిర్మాణం, సంపద సృష్టిలో పరిశ్రమల భాగస్వామ్యం కీలకం -ఢిల్లీలో సీఐఐ సదస్సులో టాస్క్ ఫోర్సు నివేదిక ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణాంధ్ర 2047 సాకారం …

Read More »

సాస్కి కింద రాష్ట్రానికి రూ.10,000 కోట్లు ఇవ్వండి

-రెవెన్యూ లోటు భర్తీ చేయండి -కేంద్ర ఆర్ధిక మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతి ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్ధిక సాయం పథకం సాస్కి(SASCI) కింద 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. బుధవారం రెండో రోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక …

Read More »

కృష్ణ, గోదావరి నదీ జలాల పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు సఫలం

-కెఆర్ఎంబి అమరావతిలో, జిఆర్ఎంబి హైదరాబాదులో -రిజర్వాయర్ల అవుట్ ఫ్లోల కు టెలీ మీటర్లు -పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ సాంకేతిక అంశాలు, సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక కమిటీ -ఢిల్లీ లో కేంద్ర మంత్రి తో సమావేశం వివరాలు వెల్లడించిన మంత్రి నిమ్మల రామానాయుడు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర జల శక్తి మంత్రి సి ఆర్ పాటిల్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఫలప్రదమైనట్లు రాష్ట్ర జల …

Read More »

ECI meeting with presidents of various national and state political parties

New Delhi, Neti Patrika Prajavartha : The meeting is in continuation of the interactions being held by ECI with the Presidents of various National and State Political Parties. These interactions provide for a long-felt need of constructive discussions which enable National and State Party Presidents to share their suggestions and concerns directly with the Commission. This initiative aligns with the …

Read More »

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

-రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు మధ్య చర్చ -నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీతోనూ సీఎం సమావేశం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై ఇరువురు నేతలు చర్చించారు. ముందుగా మాజీ కేంద్ర మంత్రి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్ గా నియమించడంపై హోం మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం …

Read More »

చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలి

-చట్టాలు చేసేది… సంస్కరణలు తెచ్చేది రాజకీయ నేతలే… బ్యూరోక్రాట్లు కాదు -ఆర్థిక సంస్కరణలకు పీవీ ఆద్యుడు…నేటి ప్రగతికి బీజం వేసింది పీవీనే -వాజ్‌పేయితో కలిసి పని చేయడం నా అదృష్టం -మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ కల సాకారమవుతోంది -మంచి పాలసీలు చేసే వారినే ప్రజలు ఎన్నుకోవాలి -పీవీ 17 భాషలు మాట్లాడేవారు…నేడు దేశంలో ఒక భాషపైనా చర్చ జరుగుతోంది -మాజీ ప్రధాని పీవీ స్మారక ఉపన్యాస సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు -ఢిల్లీలో ద లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పీవీ నరసింహారావు పేరుతో …

Read More »

భారతదేశం రికార్డు స్థాయిలో తొలి త్రైమాసిక ఎగుమతులు నమోదు చేసింది…

-వ్యాపార లోటు భారీగా తగ్గింది -FIEO అధ్యక్షుడు ఎస్. సీ. రల్హాన్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : 2025–26 ఆర్థిక సంవత్సరపు మొదటి త్రైమాసికంలో భారత్ ఎగుమతులు చారిత్రక స్థాయిని సాధించాయి. వస్తువులు మరియు సేవల కలిపిన ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 6% పెరిగి మొత్తం 210.31 బిలియన్ డాలర్లను చేరాయి. ఈ విషయాన్ని భారత ఎగుమతిదారుల సమాఖ్య (FIEO) అధ్యక్షుడు ఎస్. సీ. రల్హాన్ ప్రకటించారు. “భారత ఎగుమతిదారుల అద్భుతమైన ప్రతిభ, లఘు వాణిజ్య వాతావరణంలోను అత్యుత్తమ ఫలితాలు సాధించగల …

Read More »

ఓ డి ఓ పి 2024 అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న మంత్రి ఎస్. సవిత

-మొత్తం 29 అవార్డులలో పదింటిని గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఓడిఓపి 2024 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నేడు ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖామాత్యులు పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తదితరులు పాల్గొన్నారు.‌ …

Read More »

కేంద్ర హిందీ సలహా సమితిలో ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సభ్యత్వం

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన రెవెన్యూ విభాగం లో పునఃరూపకల్పన చేసిన సంయుక్త హిందీ సలహా సమితిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, రచయిత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను సభ్యునిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి ఆర్థిక మంత్రి ఛైర్మన్‌గా, సహాయ ఆర్థిక మంత్రి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. విభిన్న కేంద్ర శాఖలైన రెవెన్యూ, వ్యయము, పెట్టుబడి, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయాల …

Read More »