గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు తెలగమాంబ చెరువు అభివృద్ధి పనుల ప్రక్రియను వేగవంతం చేయాలని, జిఎంసి, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా చెరువుని పరిశీలించి, సోమవారానికి నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో జిఎంసి, ఇరిగేషన్ అధికారులతో అత్యవసర సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తెలగమాంబ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అందులో భాగంగా ప్రస్తుతం చెరువులో …
Read More »Tag Archives: guntur
‘దిత్వా’ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతానికి ఇది పుదుచ్చేరికి 410 కి.మీ., చెన్నైకి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. తుపాన్ గడిచిన 6 గంటల్లో 3కి.మీ వేగంతో కదిలిందని వెల్లడించారు. ఎల్లుండి తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు …
Read More »ఇ.వి.ఎం గోడౌన్ ను తనిఖీ చేసిన డి.ఆర్.ఓ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరులో ఉన్న ఇ.వి.ఎం గోడౌన్ ను జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి శుక్రవారం తనిఖీ చేశారు. కాలానుగుణ (పీరియాడికల్) తనిఖీల్లో భాగంగా సంబంధిత అధికారులు, ప్రతినిధులతో కలిసి తనిఖీ నిర్వహించారు. నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా ఫిరంగిపురం రేపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో భద్ర ఉన్న గోడౌన్ ను రెవిన్యూ డివిజినల్ అధికారి కె.శ్రీనివాస రావు భద్రతా ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read More »29న దివ్యాంగుల క్రీడా పోటీలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (International Day of Persons with Disabilities) సందర్భంగా శనివారం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి దుర్గా భాయి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా, “సామాజిక పురోగతికి వికలాంగులకు సమగ్ర సమాజం నిర్మాణం” అనే థీమ్‌తో డిసెంబరు 3వ తేదీన దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా ఎన్.టి.ఆర్ స్టేడియంలో …
Read More »అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థల యజమానులకు నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం విజయపురి కాలనీ, పాండురంగ నగర్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్టీసి కాలనీ, ఐపిడి కాలనీ, పొన్నూరు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నివాస ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు …
Read More »అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్లలో పరిశుభ్రత పాటించాలని, ఆహారం సరఫరా అనంతరం శుభ్రం చేయాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని పరిశీలించి, ప్రజలతో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నందున, అందుకు తగిన విధంగా పరిశుభ్రత పట్ల సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అమరావతి రోడ్ లోని క్యాంటీన్ లో …
Read More »సమగ్ర సర్వేకి వేగంగా పూర్తి చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వార్డ్ సచివాలయాల వారీగా జరుగుతున్నసమగ్ర సర్వేకి వేగంగా పూర్తి చేయాలని, నోడల్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం స్థానిక ఆకులవారితోటలోని 83,84 వార్డ్ సచివాలయాలను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, సర్వే ఆన్ లైన్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో సమగ్ర సర్వే ఖచ్చితమైన వివరాలతో అప్ లోడ్ చేయాలన్నారు. ప్రతి కార్యదర్శి తమకు కేటాయించిన …
Read More »పరిష్కారం దిశగా పెమ్మసాని
-స్పష్టమైన మార్గాల అన్వేషణ దిశగా పెమ్మసాని సమీక్ష -మంత్రి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబు, అధికారులతో సమగ్ర సమావేశం -తదుపరి సమావేశం కోసం కసరత్తు -గైడ్ లైన్స్ నుంచి గ్రౌండ్ రియాల్టీ వరకు సమగ్ర చర్చ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రైతుల భూ సమస్యలకు పరిష్కారమే పరమావధిగా పెమ్మసాని ప్రయత్నిస్తున్నారు. స్పష్టమైన పరిష్కారాల నిమిత్తం సమగ్రంగా సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా అర్బన్ డెవలప్మెంట్ & మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ …
Read More »భారత రాజ్యాంగం ద్వారానే ప్రతి పౌరునికి సమాన హక్కులు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత రాజ్యాంగం ద్వారానే ప్రతి పౌరునికి సమాన హక్కులు దక్కాయని గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి పాల్గొని, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, 1949 నవంబర్ 26న భారత …
Read More »సమగ్ర సర్వేకి నగర ప్రజలు సహకరించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అన్, అండర్ అసెస్మెంట్ లపై వార్డ్ సచివాలయాల వారీగా జరుగుతున్నసమగ్ర సర్వేకి నగర ప్రజలు సహకరించాలని, ప్రతి కార్యదర్శి తమకు కేటాయించిన రోజువారీ లక్ష్యమైన 20 ఇళ్ల సర్వే పూర్తి చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం స్థానిక పాత గుంటూరులోని 14వ వార్డ్ సచివాలయం పరిధిలో జరుగుతున్న సర్వేలో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వార్డ్ …
Read More »
Prajavartha Online Telugu News