Breaking News

Tag Archives: guntur

రోడ్ల పక్కన మొక్కలు నాటడానికి వీలుగా రింగ్స్ ఏర్పాటు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అభివృద్ధి పనుల్లో భాగంగా నూతన రోడ్ల నిర్మాణ సమయంలోనే రోడ్ల పక్కన మొక్కలు నాటడానికి వీలుగా రింగ్స్ ఏర్పాటు చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ముత్యాలరెడ్డి నగర్, స్వర్ణభారతి నగర్, విజయపురి కాలనీ, జేకేసి రోడ్, శ్రీనివాసరావుతోటల్లోని పలు ప్రాంతాలను పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పర్యావరణ పరిరక్షణ, మిషన్ …

Read More »

అన్నక్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్ల వద్ద మౌలిక వసతుల కల్పనలో జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం అమరావతి రోడ్ లోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారికి ఏ ఇబ్బంది లేకుండా లైటింగ్, ఫ్యాన్ల ఏర్పాటు, ఎక్కడైనా మరమత్తులు ఉంటే వెంటనే చేపట్టాలన్నారు. పరిసరాల్లో పరిశుభ్రతకు అధిక …

Read More »

జాతీయ కాలుష్య నిరోధక దినోత్సవం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 2న భారత ప్రభుత్వం జాతీయ కాలుష్య నిరోధక దినోత్సవంను నిర్వహిస్తుంది. గాలి, నీరు, నేల కాలుష్యం వల్ల కలిగే హానికర ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB), ప్రాంతీయ కార్యాలయం – గుంటూరు ఆధ్వర్యంలో గుంటూరులోని భారతీయ విద్యా భవన్‌ విద్యాశ్రమ పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని MD. నజీనా బేగం, APPCB గుంటూరు జిల్లా …

Read More »

14 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడేషన్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని 14 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సెలక్షన్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. జిల్లాలో మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేయుటకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్ గ్రేడ్ చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో నిర్దేశిత మార్గదర్శకాలు …

Read More »

ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక సరఫరా జరిగేలా మైనింగ్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక సరఫరాపై ఐవిఆర్ఎస్ ద్వారా నిర్వహిస్తున్న పబ్లిక్ పర్సెప్షన్ లో సంతృప్తి స్థాయి మరింత మెరుగుపరిచేలా …

Read More »

మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన, ఎన్ఫోర్స్మెంట్  పటిష్టంగా అమలు చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన, ఎన్ఫోర్స్మెంట్  కార్యక్రమాలను సంబంధిత శాఖలు  క్షేత్రస్థాయిలో  పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం మాదక ద్రవ్యాల నియంత్రణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అధ్యక్షతన  జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల  వినియోగానికి ఆకర్షితులవుతున్న వారిని ప్రాథమిక దశలోనే గుర్తించేలా విద్యాసంస్థలు, వసతి గృహాల్లో అధికారులు  నిరంతర పర్యవేక్షణ,  అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.‌  మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు వ్యసనపరులుగా మారకముందే …

Read More »

లైవిలీహుడ్స్ కార్యాచరణ ప్రణాళిక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా DRDA ఆధ్వర్యంలో FPO బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, FPO కమ్యూనిటీ కోఆర్డినేటర్లు (CCs), అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్లు (APMs), మరియు మండల సమాఖ్య (MS) అధ్యక్షుల కోసం సమగ్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ప్రధానంగా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ (IFC) భావనపై అవగాహన పెంపు చేయడం, అలాగే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ (FPOs) పాత్రలు మరియు బాధ్యతలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ముఖ్య అతిథిగా అదనపు CEO–SERP శ్రీరాములు నాయుడు …

Read More »

నేడే జాబ్ మేళా

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి ఆదేశముల మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి కృషి చేస్తున్నది. దీనిలో భాగముగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ది అధికారి కొండా సంజీవరావు మాట్లాడుతూ గౌరవ శాసనసభ్యులు గుంటూరు తూర్పు నియోజకవర్గం మహమ్మద్ నజీర్(MLA) ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, ఆధ్వర్యంలో ఈ నెల 03-12-2025వ తేదీన …

Read More »

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) లో రెవెన్యూ అంశాలు పట్ల అందిన ఆర్జీలపై నియోజక వర్గం స్థాయిలో రెవెన్యూ నోడల్ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందిన ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పట్ల పూర్తి అవగాహన పొందాలన్నారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదని ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. …

Read More »

ఆటా పాటలతో… చిన్నారుల వికాసానికి బాటలు వేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఆటా పాటలతో చిన్నారుల వికాసానికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. గుంటూరు నగరంలోని వాసవినగర్ మోడల్ ఫౌండేషన్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫౌండేషన్ స్కూల్ లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రంతో సహా ఐదవ తరగతి వరకు ఉన్న అన్ని తరగతులను పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను పరిశీలించారు. వారి ఎత్తు, బరువులను స్వయంగా పరిశీలించారు. ఆటా పాటలతో, బోధన …

Read More »