Breaking News

Tag Archives: guntur

మాంస వ్యర్ధాల అనధికార తరలింపుదారులపై చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మాంస వ్యర్ధాల అనధికార తరలింపుదారులపై చర్యలు తీసుకుంటామని, జిఎంసి నుండి నిర్దేశిత టెండర్ ద్వారా వ్యర్ధాల తరలింపు కాంట్రాక్ట్ పొందిన ఏజన్సీనే వ్యర్ధాలను సేకరిస్తుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో చికెన్ షాప్ ల అసోసియేషన్ ప్రతినిధులు, నగరపాలక సంస్థ ప్రజారోగ్య అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చికెన్, మటన్, చేపల విక్రయదారులు తమ షాప్ లలో …

Read More »

ఆత్మీయ సమావేశాల ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం భారత్ పేటలోని మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశంలో కమిషనర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాల ఏర్పాటు ద్వారా విద్యా రంగంలో నూతన ఒరవడికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. తల్లిదండ్రులు తమ …

Read More »

మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పిన్ పాయింట్ గా మెరుగైన పారిశుధ్య పనులు చేపట్టాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులు, కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం జేకేసి కాలేజీ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, ఆర్టీసి కాలనీ, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత …

Read More »

అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నక్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నఆహారం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని, అందుకు తగిన విధంగా ఆహారం అందించడానికి ఇండెంట్ చూసుకోవాలని అక్షయపాత్ర సిబ్బందిని …

Read More »

రోడ్లు డ్రైన్ నిర్మాణం అనంతరమే చేపట్టాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నూతనంగా నిర్మాణం చేసే రోడ్లు డ్రైన్ నిర్మాణం అనంతరమే చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం స్తంభాల గరువు, బ్రాడీపేట, అరండల్ పేటల్లోని పలు ప్రాంతాలను పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో డ్రైన్ లు ఏర్పాటు చేయకుండా రోడ్లు నిర్మాణం చేయడం వలన వర్షాలకు రోడ్లు నీరు నిలిచి మరమత్తులకు …

Read More »

బిపిఎస్ ద్వారా క్రమబద్దీకరించుకొనే అవకాశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నిర్దేశిత మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల అనుమతి లేకుండా లేదా అనుమతి పొందిన ప్లానుకు భిన్నంగా ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీలోపు నిర్మించిన భవనాలను బిపిఎస్ ద్వారా క్రమబద్దీకరించుకొనే అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ ఎంఎస్ నం.225 జారీ చేసిందని, ప్రజలకు అవగాహన కల్గించి దరఖాస్తు చేసుకునేలా లైసెన్స్డ్ ఇంజినీర్లు, ప్లానింగ్ కార్యదర్శులు చొరవ చూపాలని పట్టణ ప్రణాళిక రీజనల్ డిప్యూటీ డైరెక్టర్(ఆర్డీ) పి.మధుకుమార్ తెలిపారు.గురువారం స్థానిక కాకాని రోడ్ లోని ఏఎస్ కన్వెన్షన్ హాల్లో పట్టణ …

Read More »

రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలని నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఈ మేరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. బుధవారం బుధవారం గుంటూరు విచ్చేసిన మంత్రి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పలనాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా, శాసనసభ్యులు శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ తో గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ అంశాలను చర్చించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో …

Read More »

సేవా దృక్పథానికి ఎన్.ఎస్.ఎస్ గొప్ప అవకాశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సేవా దృక్పథానికి ఎన్.ఎస్.ఎస్ గొప్ప అవకాశం అని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పర్యావరణ ఇంజనీరు మహమ్మద్ నజీనా బేగం అన్నారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే సేవా దృక్పథం అలవడాలని, తద్వారా భవిష్యత్తులో ఉన్నత ఆలోచనలతో రాణిస్తారని చెప్పారు. ప్రభుత్వ మహిళా కళాశాల (స్వయం) గుంటూరు జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్ ) యూనిట్ 1 ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం ఏటి అగ్రహారం లోని ఎస్ కే బి ఎం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగింది. …

Read More »

త్వరగా స్మార్ట్ కార్డులు పొందాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్మార్ట్ రేషన్ కార్డులను త్వరగా పొందాలని జిల్లా పౌర సరఫరాల అధికారి పి.కోమలి పద్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పాత రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రైస్ కార్డుల ను ప్రభుత్వం ముద్రించి కార్డుదారులకు పంపిణీ చేయమని ఆదేశించడం జరిగిందన్నారు. పంపిణీ ప్రక్రియను సెప్టెంబరు ఒకటవ తారీఖు నుండి సచివాలయాల సిబ్బంది, రేషన్ షాపు డీలర్ల ద్వారా పంపిణీ ప్రారంభించామన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,36,406 కార్డుదారులకు పంపిణీ …

Read More »

నగరంలో 29.71 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సుమారు 29.71 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించుటకు స్థాయిసంఘం ఆమోదం తెలిపిందని స్తాయి సంఘ అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. బుధవారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన …

Read More »