Breaking News

అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నక్యాంటీన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నఆహారం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం ఆర్టీఓ కార్యాలయం దగ్గరలోని అన్న క్యాంటీన్ ని కమిషనర్ పరిశీలించి, ఆహారం తీసుకుంటున్నవారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ఆహారం తీసుకునేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందని, అందుకు తగిన విధంగా ఆహారం అందించడానికి ఇండెంట్ చూసుకోవాలని అక్షయపాత్ర సిబ్బందిని ఆదేశించారు. ఆహారం తీసుకుంటున్న వారు కూడా ఆహార నాణ్యత, మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. క్యాంటీన్ కి వచ్చే వారి అభిప్రాయాలను అక్షయ పాత్ర సిబ్బంది రికార్డ్ చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *