Breaking News

Tag Archives: guntur

శంకర్ విలాస్ ఆర్.ఓ.బి వేగవంతానికి చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రైల్వే ప్రాజెక్టుల పురోగతి పై స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నశీర్ అహ్మద్ తో కలిసి గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గల ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో శనివారం సమీక్ష  నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ గుంటూరు నగర, రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. శంకర్ విలాస్ వంతెన రైల్వే ట్రాక్ పై ఉన్న పాత వంతెన డెమోలిష్ చేసే బాధ్యత ఓ ఏజెన్సీకి …

Read More »

వివేకానంద ఆశయాలతో యువత ముందుకు సాగాలి.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-యువజన ఉత్సవాల ముగింపులో బహుమతుల ప్రదానం చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడాశాఖల మంత్రి గుంటూరు, కేఎల్ యూనివర్సిటీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు రోజుల ‘యువ కార్యక్రమం’ యువతకు గొప్ప స్ఫూర్తిని అందించిందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలోని ఆర్&డి ఆడిటోరియంలో నిర్వహించిన యువజన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ …

Read More »

21న సుప్రీమ్ కోర్టు జడ్జి రాక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 21న జిల్లాకు విచ్చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 21న జ్యుడిషియల్ అకాడమీలో జరిగే “అప్ హోల్డింగ్ ద కానిస్టిట్యూషనల్ విజన్ – ద రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జూడీషియర” అనే సెమినార్ లో న్యాయమూర్తి పాల్గొంటారని చెప్పారు.

Read More »

పోలియో బూత్ కు తీసుకురండి… రెండు చుక్కలు వేయించండి

-21న పల్స్ పోలియో కార్యక్రమం గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పోలియో బూత్ కు చిన్నారులను తీసుకురండి… రెండు పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద శనివారం ర్యాలీకి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో ఇందులో …

Read More »

యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి సారించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : యువత గ్రీన్ స్కిల్స్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా “పర్యావరణంలో అవకాశాలు” (Opportunities in Environment) అనే థీమ్‌ తో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శనివారం వివిధ సంస్థలు, విద్యా సంస్థలు ప్రదర్శనలు ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు, నగర పాలక సంస్థ కమిషనర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల ఒక థీమ్ …

Read More »

రోడ్ల వెంబడి, డ్రైన్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రధాన రోడ్ల వెంబడి, డ్రైన్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శనివారం రైల్ పేట, రత్నగిరి నగర్, సంగడి గుంట తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్ ఆక్రమణలను, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్లు, డ్రైన్ల ఆక్రమణల వలన ప్రజల రాకపోకలు తీవ్ర ఆటంకం …

Read More »

ప్రజారోగ్య కార్మికులు, మెప్మా రీసోర్స్ పర్సన్స్ కి శిక్షణా శిబిరం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నూతన ఏడాది నుండి ప్రతి ఇంటి నుండి తడిపొడిగా వ్యర్ధాలు విభజన చేసే జిఎంసికి అందించే లక్ష్యంతో ప్రజలకు అవగాహన కల్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ప్రజారోగ్య కార్మికులు, మెప్మా రీసోర్స్ పర్సన్స్ కి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ, సాహస్, వాష్ స్వచ్చంద సంస్థలు శనివారం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని డిఆర్ఎం కన్వెన్షన్ …

Read More »

దోమలపై దండయాత్ర పేరుతో అవగాహన మానవహారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్ధుల్లో స్వచ్చత, ఆరోగ్యం పట్ల కల్గించే అవగాహన యావత్ ప్రజానీకానికి వేగంగా చేరుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అన్నారు. శనివారం అభ్యుదయ మహిళా విద్యా సంస్థల డైరెక్టర్ బి.రోహిణి దేవి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురం మెయిన్ రోడ్ లోని మధర్ థెరిస్సా విగ్రహం దగ్గర దోమలపై దండయాత్ర పేరుతో జరిగిన అవగాహన మానవహారం, ఫ్లాష్ మాబ్ లో కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర-స్వచ్చ ఆంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల …

Read More »

సరస్ (SARAS) ఎగ్జిబిషన్ 2026 విజయవంతంగా నిర్వహించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు లో జరగనున్న సరస్ ఎగ్జిబిషన్ 2026 ను విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పటిష్ట ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో సరస్ ప్రదర్శన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సరస్ (SARAS – Sale of …

Read More »

ఎంఎస్ఎంఈల పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈల పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లా పారిశ్రామిక మరియు ఎగుమతుల ప్రోత్సాహక మండలి (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లకు అవసరమైన భూముల కేటాయింపుకు పరిశ్రమలు, ఏపిఐఐసి శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు రాష్ట్రస్థాయిలో ఎంఓయులు జరిగిన …

Read More »