గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంచాలకులు, ఖజానా మరియు లెక్కలు, మంగళగిరి వారి ఉత్తర్వులు మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ యెక్క లైఫ్ సర్టిఫికెట్ ను 1వ తేదీ జనవరి 2026 నుంచి 28వ తేదీ ఫిబ్రవరి 2026 లోపు మాత్రమే జీవన్ ప్రామాన్ అప్లికేషన్ ద్వారా కానీ జీవన్ ప్రమాన్ ఫేస్ అప్లికేషన్ ద్వారా కానీ సంబంధిత ఉప ఖజానా కార్యాలయము నందు సమర్పించవలసినదిగా యం.చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా ఖజానా అధికారి మరియు లెక్కలు శాఖ, గుంటూరు వారు తెలిపియున్నారు. …
Read More »Tag Archives: guntur
రాష్ట్ర గవర్నర్ కు ఘన స్వాగతం
పెదనందిపాడు (గుంటూరు జిల్లా), నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా పెదనందిపాడుకు శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా.బూర్ల రామాంజనేయులు ఘన స్వాగతం పలికారు. పెదనందిపాడులో సుప్రీమ్ కోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వర రావు గృహానికి సతీసమేతంగా గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, డి.ఎస్.పి భానోదయ …
Read More »20.95 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సుమారు 20.95 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించుటకు స్థాయిసంఘం ఆమోదం తెలిపిందని అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. శుక్రవారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు …
Read More »పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలన
గుంటూరు నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో డ్రైన్లలో వ్యర్ధాలు వేసి, మురుగుపారుదలకు ఆటంకం కల్గించే వారిని గుర్తించి, వారికి భారీ అపరాధ రుసుం విధించడం, కమర్షియల్ సంస్థల అయితే సీజ్ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం జేకేసీ కాలేజి రోడ్, డొంక రోడ్, ఏటుకూరు రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి డివైసిలో అందిన ఫిర్యాదులను, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »15 అడుగుల అటల్ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి సందర్భంగా 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ గురువారం జరిగింది. ఈ ప్రదేశాన్ని అటల్ బిహారీ వాజ్ పేయి స్మృతి వనంగా తీర్చిదిద్దనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం పేరుతో బహిరంగ సభ జరిగింది. అటల్ బిహారీ వాజ్ పేయి …
Read More »విద్యా ప్రమాణాలు మెరుగుకు “మన బడి – మన బాధ్యత”
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుకు గుంటూరు జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం ప్రారంభించింది. ముఖ్యంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలు పట్ల అవగాహన కల్పించడం తద్వారా పది పరీక్షలలో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో గల 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి ఆయా పాఠశాలల …
Read More »సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా నిర్వహించాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : 2026 జనవరి లో జరగనున్న సంక్రాంతి సంబరాలు గ్రాండ్ గా నిర్వహించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. బుధవారం గుంటూరు తూర్పు,పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల శాసన సభ్యులు మహమ్మద్ నసీర్, గళ్ళా మాధవి, బూర్ల రామాంజనేయులు మరియు నగర కమిషనర్ పులి శ్రీనువాసులు గార్లతో ఆయన ఛాంబర్ నందు సమావేశం నిర్వహించి, సంక్రాంతి సంబరాలు మరియు నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగంతి పై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ …
Read More »రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలకు తరలింపు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం కల్గిస్తూ, ప్రమాదాలకు కారణంగా ఉంటున్నఆవులను, ఎద్దులను 3 బృందాల ద్వారా గోశాలకు తరలించడం జరుగుతుందని, తరలించిన వాటిని ఎట్టి పరిస్తితుల్లో తిరిగి ఇవ్వబడవని, తరలింపుని అడ్డుకుంటే పోలీసు కేసులు నమోదు చేస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. బుధవారం ఎల్ఆర్ కాలనీ, ఏటుకూరు రోడ్ ప్రాంతాల్లో రోడ్ల మీద ఉన్న ఆవులను గోశాలకు తరలింపులో కమిషనర్ నేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …
Read More »సమస్యలపై తక్షణ స్పందనకు పురమిత్ర యాప్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర ప్రజలు తమ స్థానిక సమస్యలపై తక్షణ స్పందనకు పురమిత్ర యాప్ ని వినియోగించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. బుధవారం ఆర్టీసి కాలనీ, ఐపిడి కాలనీ, ఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పిజిఆర్ఎస్, డివైసిలో అందిన ఫిర్యాదులను, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి, ప్రజలతో పురమిత్ర యాప్ ని డౌన్లోడ్ చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పురమిత్ర యాప్ ద్వారా 122 …
Read More »సారస్ కు ముమ్మర ఏర్పాట్లు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సారస్ (SARAS – Sale of Articles of Rural Artisans Society – సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిసన్స్ సొసైటీ) ప్రదర్శన శాలకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 3వ తేదీ నుండి 15వ తేదీ వరకు గుంటూరు కాకాని రోడ్ లో మణిపురం బ్రిడ్జి దగ్గరలో గల గ్రీన్ లీఫ్ టొబాకో త్రెషోల్డ్ ప్రాంగణంలో ప్రదర్శన శాలల ఏర్పాటుకు వేదికగా నిర్ణయించారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ ఎగ్జిబిషన్లో ఆంధ్రప్రదేశ్ …
Read More »
Prajavartha Online Telugu News