Breaking News

Tag Archives: Rājamahēndravaraṁ

పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

– రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్. కృష్ణ నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అందజేసిన పీజీఆర్‌ఎస్ అర్జీలతో పాటు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అందిన వినతులను ఆర్డీవో …

Read More »

నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా స్వీకరించిన అర్జీలు, అలాగే రెవెన్యూ క్లినిక్‌లో అందిన అర్జీలను సంబంధిత అధికారులు శ్రద్ధతో స్వీకరించి, నిర్ణీత గడువులో పరిష్కార మార్గం చూపడంలో పూర్తి బాధ్యత వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ @ లో PGRS మరియు రెవెన్యూ క్లినిక్లను రెండు వేదికల ద్వారా నిర్వహించి అర్జీలను స్వీకరించడం జరిగింది. కలెక్టరేట్ లో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 129 …

Read More »

బదిర విద్యార్థుల కేరింతలతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు…

-బదిర విద్యార్థులకు సంక్రాంతి కానుకగా 50వేల రూపాయలు అందించిన ఎమ్మెల్యే గోరంట్ల… -పలుకు సంస్థ నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల, ఎమ్మెల్సీ వీర్రాజు… రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక స్వరాజ్య నగర్ సంకల్పమ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలుకు బదిరుల ఆశ్రమ పాఠశాల స్థాపించి 15 వ వార్షికోత్సవము మరియు సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాజరయ్యారు. వారితోపాటు ది.ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ …

Read More »

గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం…

-సంక్రాంతి కానుకగా 3.10 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే ఆర్&బి రోడ్లకు శంకుస్థాపన… -38 లక్షల రూపాయలతో మడికి నుండి మెర్నిపాడు వరకు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం… -నియోజకవర్గంలో వాడ వాడల అభివృద్ధి పనులు… -గ్రామాల అభివృద్ధి తన ధ్యేయమన్న ఎమ్మెల్యే గోరంట్ల… రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఆర్ అండ్ బి …

Read More »

‘మీకోసం’ PGRSతో పాటు భూమి సమస్యలకు రెవెన్యూ క్లినిక్

– ఇంచార్జి జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ‘మీకోసం’ PGRS కార్యక్రమంతో పాటు, భూమి సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారానికి జనవరి 12 (సోమవారం) ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లోని PGRS హాల్‌లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నందున, మండల స్థాయి ‘మీకోసం’కు …

Read More »

సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడల పోటీల

-ఈ నెల 13న రాజమహేంద్రవరంలోనీ ఎస్.కె.వి.టి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో – జిల్లా క్రీడా అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు జిల్లా స్థాయిలో సాంప్రదాయ క్రీడల పోటీలను స్థానిక ఎస్ కె వి డిగ్రీ కళాశాల లోన్నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డి.ఎం.ఎం. శేషగిరి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  సూచనల మేరకు, ఆంధ్రప్రదేశ్ …

Read More »

ఆదివారం కలెక్టరేట్‌లో వడ్డే ఓబన్న జయంతి వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్‌లో రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ టి. సీతారామ మూర్తి పేర్కొన్నారు. మన …

Read More »

గృహ హింసను అరికడదాం

– గృహ హింస మన సంస్కృతి కాదు – కలెక్టర్ (ఎఫ్ఎసి) వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గృహ హింసను అరికట్టేందుకు సమాజం మొత్తం బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ (ఎఫ్‌ఏసీ) / జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో “గృహ హింసను అరికడదాం – గృహ హింస మన సంస్కృతి కాదు” అనే అంశంపై రూపొందించిన అవగాహనా పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వై మేఘా స్వరూప్ మాట్లాడుతూ, గృహ హింస …

Read More »

పిజిఆర్ఎస్‌లో 146, రెవెన్యూ క్లినిక్‌లో 141 అర్జీలు స్వీకరణ

– జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం (05.01.2026) కలెక్టరేట్‌లో నిర్వహించిన పిజిఆర్ఎస్ మరియు రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో వరుసగా 146 మరియు 141 అర్జీలు స్వీకరించబడినట్లు జిల్లా కలెక్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వై మేఘా స్వరూప్ తెలిపారు. పిజిఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను హేతుబద్ధతతో పరిశీలించి, సమస్యలు తిరిగి ఓపెన్ కాకుండా సమగ్ర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, …

Read More »

ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు–2026కు రాష్ట్ర స్థాయి ఎంపికలు

-జనవరి 8న కాకినాడలో నిర్వహణ – జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డి.ఎం.ఎం. శేషగిరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్కీం పథకంలో భాగంగా ఈ ఏడాది గిరిజన క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి తొలిసారిగా ‘ఖేలో ఇండియా ట్రైబల్ క్రీడలు–2026’ పేరుతో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించ నున్నట్లు, ఈ పోటీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ఎంపికలను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు జనవరి 8, 2026న కాకినాడలో నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి …

Read More »