-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎపీలో ఉన్నత విద్యా మండలిని ఉద్దేశ్యపూర్వకంగా నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమవ్వడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. భారతదేశంలో మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1988వ సంవత్సరం మే నెలలో ఉన్నత విద్యా మండలిని స్థాపించడం జరిగింది. ఉన్నత విద్యలో సలహాలు, పర్యవేక్షణ, ప్రమాణాలు పెంచాలనే సమున్నత లక్ష్యంతో నాటి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక …
Read More »Tag Archives: vijayawada
రంజాన్ విశిష్టతతో టీచర్స్ కు ఉగాది కానుక
-ఎన్ ఆర్ ఐ స్కూల్ ఇఫ్తార్ విందులో పాల్గొని టీచర్స్ కు చీరలు బహుకరించిన అల్తాఫ్ బాబా ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కొండపల్లి పట్టణం లో ఎన్నారై విద్యాసంస్థల ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పిల్లలకు సర్వమత సమ్మేళనం గురించి తెలిసే విధంగా అన్ని మతాలను గౌరవించాలని ఇలాంటి కార్యక్రమాలు …
Read More »ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ విజయవాడలో ప్రారంభం
– పునరుజ్జీవ అభివృద్ధి మరియు “సహజ జీవన విధానం”కు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండు రోజుల ప్రతిష్టాత్మక ఆంధ్ర లైఫ్ ఫర్ నేచర్ సమ్మిట్ ఈ రోజు విజయవాడలోని హోటల్ హయాత్ ప్లేస్ లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌కు సుస్థిర భవిష్యత్తును రూపొందించడానికి రాష్ట్ర నాయకులు, పర్యావరణ నిపుణులు, విధాన కర్తలను ఒకే చోట చేర్చింది ఈ శిఖరాగ్ర సదస్సు. “సహజ – జీవన్ – విధానం: ఆంధ్రప్రదేశ్ లో పునరుజ్జీవ భవిష్యత్తు కోసం లైఫ్ ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడం” …
Read More »సేంద్రియ సాగుకు చేయూత ఇవ్వాలి..
– ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలి – కీలక ప్రగతి సూచికల (కేపీఐ) సాధనలో బ్యాంకులు భాగస్వాములు కావాలి – డీసీసీ, డీఎల్ఆర్‌సీ సమావేశంలో కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాను సేంద్రియ వ్యవసాయ ఉత్పతులకు హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌ను ప్రోత్సహించేందుకు బ్యాంకులు కృషిచేయాలని, ఔత్సాహిక రైతులకు సులభంగా రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. …
Read More »జీజీహెచ్‌లో యూత్ టైం బ్యాంక్
– వినూత్న కార్యక్రమాల ద్వారా సేవాభావం – సేవలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా యువజన సర్వీసులు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూత్ టైం బ్యాంకు సేవలను జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మంగళవారం న్యూ జీజీహెచ్‌లో యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్, వైద్యాధికారులతో కలిసి ప్రారంభించారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, వాసవ్య మహిళా మండలి చేయూతతో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలోని ఓపీడీ బ్లాక్, డా. ఎన్టీఆర్ …
Read More »పశువుల కాపరులకు చేయూతను అందించే ఉద్దేశ్యంతో జాతీయ పశువ్యాది నియంత్రణా పధకం ఏర్పాటు..
-నాలుగు నెలల వయస్సు గల ఆవు గేదె జాతి పశువులకు మరియు దూడలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం నిర్వహణ.. -పశుసంవర్ధక శాఖ అధికారులచే పశుపోషకులు ఇంటి వద్దనే ఏప్రిల్ 29వ తేదీ వరకూ టీకాలు కార్యక్రమం.. -పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి. దామోదర్ నాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 4 నెలల వయస్సు గల ఆవు, గేదె జాతి పశువుల్లో మరియు దూడల్లో గాలి కుంటు వ్యాధి సోకుతుందని పశుసంవర్ధక శాఖ సంచాలకులు టి. దామోదర్ నాయుడు …
Read More »రిటైర్డ్ పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యులకు మెగా ఉచిత వైద్య శిబిరం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అసోసియేషన్ ఆఫ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సహకారంతో ఏలూరు లాకులు సెంటర్ సమీపంలోని రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ అసోషియేషన్ హాల్ లో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాయి. రిటైర్డ్ పోలీస్ అధికారులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంక్షేమ దృష్టితో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో బిపి, షుగర్, ఆర్ బి ఎస్, …
Read More »నిడమానూరులో ఇఫ్తార్ విందు లో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, క్రమశిక్షణతో కూడిన ఉపవాస దీక్షలు సమాజంలో సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడ రూరల్ మండలం నిడమానూరు మస్జిద్ ఏ మినార్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, స్థానిక ముస్లిం పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిడమానూరు ముస్లిం సోదరుల చిరకాల …
Read More »రామవరప్పాడులో రూ.4.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన విప్,ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.4.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి సమస్యపై తనకు పూర్తి అవగాహన ఉందని, ప్రజలు అడగకముందే సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. రాజకీయాలు …
Read More »నున్న గ్రామంలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం లో పాల్గొన్న విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాగును లాభసాటిగా మార్చడమే కాకుండా, దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతన్నలతో నేరుగా ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంపై ఆయన ఆరా తీశారు. మెజారిటీ రైతులకు నగదు …
Read More »
Prajavartha Online Telugu News