Breaking News

Tag Archives: vijayawada

విద్యుత్ పంపిణీ సంస్థల్లో అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎపిఎస్‌పిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్ లలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎపిఎస్‌పిడిసిఎల్, ఎపిసిపిడిసిఎల్ లలో పలురకాల అక్రమాలు, అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసిపి …

Read More »

పరాభవం కాదు – ప్రాభవం

-తెలుగు కళా వైభవాన్ని పునరుద్ధరిస్తున్న కూటమి ప్రభుత్వం -విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -భావితరాలకు స్ఫూర్తినిచ్చేలా కవులు, కళాకారులు, రచయితలకు సమున్నత గౌరవం అందిస్తున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ -“తెలుగుకు వెలుగు తెస్తున్న నేత”గా సీఎం చంద్రబాబునాయుడును అభివర్ణించిన మంత్రి దుర్గేష్ -“పరాభవ” నామ సంవత్సరం అంటే అన్యాయం, అక్రమాలు, తప్పులు చేసే వారికి పరాభవమని, మంచి,న్యాయం చేసే కూటమి ప్రభుత్వానికి ఇది “ప్రాభవ” (విజయ) సంవత్సరమని పేర్కొన్న మంత్రి దుర్గేష్ -రాష్ట్ర ప్రజలకు తెలుగు నూతన సంవత్సర …

Read More »

మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం

-ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరం అని పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) అన్నారు. అందులోనూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సర్వమత సమ్మేళనంతో ఉంటుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్ అల్లినగర్‌లో మస్జీద్ ఏ అలీ మసీదుకు టిడిపి బిసి విభాగం రాష్ట్ర నాయకులు గుర్రం కొండా నేతృత్వంలో నూతనంగా నిర్మించిన మసీదు ఆర్చిని పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ….పశ్చిమ …

Read More »

అకాల వర్షాలపై అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

-కలెక్టర్ కార్యాలయంలో 91549 70454 నంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు –జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో వచ్చే మూడు రోజులపాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. వాతావరణ, విపత్తుల నిర్వహణ శాఖ సూచనల మేరకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖలు డ్రైనేజీ వ్యవస్థల విషయంలో …

Read More »

ఉగాది సందర్భంగా ఈశ్వరమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే బొండా ఉమా పూజలు – ఊరేగింపుకు శ్రీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు ఈశ్వరమ్మ దేవాలయం నందు ప్రతియేటా నిర్వహించే ఉగాది వేడుకల సందర్భంగా గురువారం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది రోజున ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ:- ఉగాది పండుగ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, కొత్త సంవత్సరాన్ని సంతోషం, శాంతి, …

Read More »

అకాల వర్షాల వల్ల వంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

– సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల కురిసిన అకాల వర్షాలు తీవ్ర గాలుల వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నాగేశ్వరరావు నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. శ్రీ సత్య సాయి జిల్లా నుండి ఏలూరు జిల్లా వరకు నిన్న రాత్రి, ఈరోజు కురిసిన వడగండ్ల వాన, …

Read More »

Centre urges nationwide STREE scaling as movement for women empowerment and green mobility

– India’s Largest Pilot Project – A Grand Success in Bihar, AP, MP & Kerala – Average Monthly Savings of ₹1,351 Achieved for 1,800 Women Beneficiaries Through E-Bicycles Vijayawada, Neti Patrika prajavartha: Buoyed by the remarkable success of its flagship pilot initiative STREE (Sustainable Transport for Rural Entrepreneurs through Electric Bicycles), the Government of India has urged all States to …

Read More »

శ్రీ ప‌రాభ‌వ‌నామ సంవత్స‌రంలో వైభ‌వంగా ఉండాలి

– జిల్లా ప్ర‌జ‌ల‌కు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఉగాది శుభాకాంక్ష‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అజ్ఞానం, అహంకారం, బలహీనతలను జయించి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్ర‌తీక అయిన శ్రీ ప‌రాభ‌వ‌నామ సంవ‌త్స‌రం జిల్లా ప్ర‌జ‌ల జీవితాల్లో కొత్త విజ‌యాల వెలుగులు నిండాల‌ని ఆకాంక్షిస్తూ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఉగాది శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తెలుగు ప్ర‌జ‌ల సంస్కృతిలో ఉగాది పండుగకు విశిష్ట స్థానం ఉందని, ఇది కేవలం కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాకుండా ఆలోచనలు, ఆశయాలను పునర్నిర్మించుకునే ఒక గొప్ప …

Read More »

సీఆర్‌డీఏ అవ‌స‌రాలకు అనుగుణంగా కార్యాచ‌ర‌ణ‌

– రాజ‌ధాని ప‌నుల్లో మైన్స్ శాఖ భాగ‌స్వామ్యం కీల‌కం – తాజాగా ఆరు క్వారీ లీజుల‌కు జిల్లాస్థాయి క‌మిటీ ఆమోదం – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : న‌వ్య రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నుల‌కు సంబంధించి సీఆర్‌డీఏ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో జిల్లా మైన్స్ శాఖ లీజుల స‌త్వ‌ర అనుమ‌తుల‌పై దృష్టిసారిస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి ప్ర‌త్యేక క‌మిటీ స‌మావేశం జ‌రిగింది. మైన్స్‌తో …

Read More »

ఎమ్మెల్యే బొండా ఉమా హామీ అమలు – ఎంపీ కేశినేని చిన్ని తో కలిసి శంకుస్థాపన

-సగర సమాజానికి శాశ్వత సదుపాయం – 75 లక్షల రూపాయలతో కళ్యాణ మండపానికి శంకుస్థాపన చేసిన MP కేశినేని శివనాథ్ చిన్ని, MLA బొండా ఉమామహేశ్వర రావు  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సెంట్రల్ నియోజకవర్గంలోని పసుపు తోట వాటర్ ట్యాంక్ ఎదురు ప్రాంతంలో, స్థానిక సగర సమాజానికి చెందిన పెద్దల 40 సంవత్సరాల చిరకాల కోరిక నెరవేరింది, 2024 ఎన్నికల పాదయాత్ర లో నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా సగర పెద్దలు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారిని …

Read More »