గుంటూరు , నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాంగులకు ఉపకరణాలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నలుగురు దివ్యాంగులకు ఒక్కొక్కటి రూ.15 వేలు విలువ గల పరికరాలను విద్యా పరంగా ఉపయోగ నిమిత్తం అందించారు. ఉపకరణాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్య అభ్యసనానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జ్యోతి బసు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ఎన్.వెంకటరవణప్ప పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News