Breaking News

జలధార పనులు త్వరగా ప్రారంభించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జలధార జలహారతి పనులు త్వరగా ప్రారంభం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. జలధార, పి.జీ.ఆర్.ఎస్, రిసర్వే, ఉపాధి హామీ తదితర అంశాలపై సోమవారం జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలధార జలహారతి పనులు మంజూరు అయినప్పటికీ, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతున్నట్లు ఆన్ లైన్ లో కనిపిస్తున్నారు. పనులు త్వరగా ప్రారంభం చేయడమే కాకుండా వాటిని వెంటనే ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలు పరిష్కరించుటకు ఆయా అర్జీలపై 48 గంటలలో చర్యలు చేపట్టాలని అన్నారు. జన గణన వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారం చేసుకుంటూ జన గణన చేయాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. రిసర్వే చేయుటకు ముందుగా ప్రజలకు నోటీసులు అందించాలని, ఇకెవైసి చేయాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *