Breaking News

పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాల తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల బస్సుల భద్రతా ప్రమాణాల తనిఖీ చేస్తున్నట్లు ఉప రవాణా కమీషనర్ కే సీతారామిరెడ్డి తెలిపారు. సోమవారం నుండి పలు పాఠశాలల వాహనాలను తనిఖీ చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమములో భాగంగా గుంటూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల బస్సుల భద్రతా ప్రమాణాలును మోటారు వాహన తనిఖీ అధికారులు తనిఖీ చేస్తున్నారని వివరించారు. పాఠశాల బస్సులు రహదారిపై ప్రయాణించడానికి ఎంత వరకు అనుకూలంగా ఉన్నాయో (Road worthiness) పరిశీలించడం, అలాగే తనిఖీలో గుర్తించిన లోపాలను సరిదిద్ది బస్సులను సిద్ధం చేసుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు సూచించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

ఈ కార్యక్షంలో భాగంగా ఇప్పటివరకు వరకు విద్యా సంస్థలకు చెందిన 106 బస్సుల భద్రతా ప్రమాణాలును తనిఖీ చేయడంజరిగిందన్నారు. మోటార్ వాహన తనిఖీ అధికారి సూచించిన భద్రతా ప్రమాణాలును విద్యా సంస్థల యాజమాన్యాలు స్కూల్ బస్సులకు పాటించి మే 10వ లోగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్ల వద్ద ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *