Breaking News

ఏపీయుఎఫ్ఐడీసి ఆధ్వర్యంలో వర్క్‌షాప్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ నిధుల సమర్థవంతమైన వినియోగం మరియు అదనపు రుణాల సమీకరణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (ఏపీయుఎఫ్ఐడీసి) ఆధ్వర్యంలో విజయవాడలోని ఫార్చ్యూన్ మురళి పార్క్ హోటల్లో మంగళవారం నుంచి రెండు రోజుల ఉన్నత స్థాయి వర్క్‌షాప్ లో గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పాల్గొన్నారు.
రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్.పొంగూరు నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కులశ్రేష్ఠ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సదస్సులో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంపత్ కుమార్ లు నగరాల మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ఆర్థిక వనరుల వ్యూహాలపై జరిపిన వర్క్ షాప్ లో కమిషనర్, జిఎంసి ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగం అధికారుల బృందంతో కలిసి హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *