అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని భక్తితో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలను, భక్తి గీతాలను రాజకీయ అవసరాల కోసం పేరడీలుగా పాడుతూ అపహాస్యం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖండించారు. నెల్లూరు నగరంలో ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ- తన రాజకీయాలకు పవిత్ర గోవింద నామాలను పేరడీగా చేస్తూ భక్తుల మనోభావాలను కించపరచిన తీరు, ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారి వైనం ధార్మిక విశ్వాసాలకు విఘాతం కలిగించేలా ఉందన్నారు. మతపరమైన విద్వేషాలు రేపే కుట్రపూరిత ఆలోచనలతో వారు చేసిన ఈ చర్యలపై చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ధార్మిక విశ్వాసంలో భాగమైన దైవ నామాలు, మంత్రాలు, స్తోత్రాలు, కీర్తనలను అపహాస్యం కోసం వాడే విధానాన్ని అందరూ విడిచిపెట్టాలని సూచించారు.
Tags amaravathi
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News