గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ నుండి 15వ తేదీ వరకు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతి వార్డ్ సచివాలయం, ప్రభుత్వ కార్యాలయం, ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగరవేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపులో భాగంగా, జిల్లా కల్లెక్టర్ ఆదేశాల ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించేలా, వారిని దేశ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు `దేశ నిర్మాణంలో భాగస్వాములు` పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చెప్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం ఎగురవేయడం, దేశ అభివృద్ధికి సూచనలతో సెల్ఫీలు తీసి పంపించడం చేయవచ్చన్నారు. అలాగే 14వ తేదీన మొక్కలు నాటడం, 14, 15 తేదీల్లో అన్ని ప్రధాన కూడళ్లు, జిఎంసి ప్రధాన కార్యాలయం, మణిపురం, కంకరగుంట ఫ్లైఓవర్స్ ని త్రివర్ణ కాంతులతో అలంకరిస్తామని తెలిపారు. కనుక నగర ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విరివిగా పాల్గొని దేశభక్తిని చాటాలని కోరారు.
Tags guntur
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News