Breaking News

విద్యుత్ మార్కెట్‌పై వర్క్‌షాప్ నిర్వహించనున్న ఏపీ ఛాంబర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) సహకారంతో ‘విద్యుత్ మార్కెట్‌పై వర్క్‌షాప్ను’ ఈ నెల 13వ తేదీ గురువారం విజయవాడలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 1,000 కిలోవాట్లు, అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న పరిశ్రమలకు ప్రత్యేకంగా అవకాశం – విద్యుత్ కొనుగోలు వ్యూహాలు, వ్యయ నియంత్రణపై అవగాహన కల్పించనుంది.

భారతదేశంలో ప్రముఖ విద్యుత్ ఎక్స్ఛేంజ్‌గా ఉన్న ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజ్ (IEX) దేశవ్యాప్తంగా విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ సర్టిఫికెట్ల ట్రేడింగ్‌కు ఆటోమేటెడ్ వేదికను అందిస్తోంది. విద్యుత్ రంగంలో పోటీతో కూడిన ధరల నిర్ణయం, పారదర్శకత, నిర్వహణ సామర్థ్యం, విద్యుత్ కొనుగోలులో సౌలభ్యం, సురక్షిత చెల్లింపు విధానాలను ప్రోత్సహించడంలో IEX కీలక పాత్ర పోషిస్తోంది.

1,000 కిలోవాట్లు (kW) మరియు అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ కలిగిన పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఈ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న విద్యుత్ మార్కెట్ పరిస్థితులు, విద్యుత్ కొనుగోలు వ్యూహాలు, వ్యయాన్ని తగ్గించుకునే అవకాశాలు, విద్యుత్ మార్కెట్‌లో భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలపై ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనే వారికి విలువైన అవగాహన లభించనుంది.

ఈ వర్క్‌షాప్‌లో పాల్గొనడం ఉచితం. అయితే ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు ఏపీ ఛాంబర్స్ను 91212 21473/ 91212 21474 నంబర్లలో సంప్రదించాలని ఏపీ ఛాంబర్స్ విజ్ఞప్తి చేసింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *