-విజేతగా AP సెక్రటేరియట్ జట్టు.. రన్నరప్‌గా విజయవాడ గార్డ్స్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) ఆధ్వర్యంలో ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌ను ఆదివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. APSPF ఉన్నతాధికారుల సూచనల మేరకు ఎయిర్‌పోర్ట్ యూనిట్ అసిస్టెంట్ కమాండెంట్ K. Rameshఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు జరిగాయి.
టోర్నమెంట్‌ను ముఖ్య అతిథిగా హాజరైన APSPF ఇన్‌స్పెక్టర్ జనరల్ బివి.రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడలు సిబ్బందిలో శారీరక,మానసిక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి,నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకర రావు, విజయవాడ ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కె.లక్మీకాంత రెడ్డి, ఎయిర్‌పోర్ట్ సిఎఎస్ఓ ధర్మేంద్ర తో పాటు విజయవాడ జోన్ వివిధ APSPF యూనిట్లకు చెందిన అసిస్టెంట్ కమాండెంట్లు పి వి ఎస్ ఎన్ మల్లికార్జున రావు, క్రిష్ణమాచారి,హేమసుందర్, కుమార్,ఇన్‌స్పెక్టర్లు పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఇంటర్-జోన్ వాలీబాల్ టోర్నమెంట్‌లో AP సెక్రటేరియట్,AP హైకోర్టు,డా. NTTPS, విజయవాడ గార్డ్స్ మరియు APSPF హెడ్‌క్వార్టర్స్ తదితర యూనిట్లకు చెందిన ఆరు జట్లు పాల్గొన్నాయి.సుమారు 250 మంది క్రీడాకారులు, సిబ్బంది, సందర్శకులు హాజరై పోటీలను వీక్షించారు.పోటీలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి.
టోర్నమెంట్‌లో AP సెక్రటేరియట్ జట్టు విజేతగా, విజయవాడ గార్డ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచాయి.ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో పాటు విజేతలు, రన్నరప్ జట్లకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా APSPF విజయవాడ జోన్ కమాండెంట్ ఎం.శంకర రావు చేతుల మీదుగా ట్రోఫీలు, బహుమతులు,ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు.
టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు APSPF ఎయిర్‌పోర్ట్ యూనిట్ అధికారులు, సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు.
Prajavartha Online Telugu News