Breaking News

నెలాఖరులోగా ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో శానిటేష‌న్ ఏజెన్సీల సిబ్బందికి ముఖ ఆధారిత హాజ‌రు త‌ప్ప‌నిస‌రి చేయాలి

-ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, శానిటేష‌న్ ఏజెన్సీల వారు పరస్పరం సమన్వయంతో పనిచేయాలి
-మంత్రి సత్యకుమార్ వెల్లడి
-ఆసుపత్రుల్లోని పరిస్థితులపై 3 గంటలపాటు సమీక్షించిన మంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త పరిశుభ్రత మరిoత మెరుగుపడేందుకు ఆసుపత్రుల సూపర్డెంట్లు, ఏజెన్సీ వారు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ వెల్ల‌డించారు. వైద్యుల హాజ‌రు, వారందించే సేవ‌లు, మందుల ల‌భ్య‌త ప‌ట్ల ప్ర‌జ‌ల సంతృప్త స్థాయికి త‌గ్గ‌ట్లుగా ప‌రిశుభ్ర‌త విష‌యంలోనూ సానుకూల‌త‌ పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌గిరిలోని ఎపిఐఐసి ట‌వ‌ర్స్‌లోని వైద్యారోగ్య శాఖ కార్యాల‌యంలో మంగళవారం సాయంత్రం బోధానాసుప‌త్రులు, జిల్లా, ప్రాంతీయ‌, సామాజిక ఆసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త తీరు, సంతృప్త స్థాయి న‌మోదు ఇత‌ర అంశాల‌పై అధికారులు, స‌ద‌రు ఆసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, శానిటేష‌న్ ఏజెన్సీల వారితో మూడు గంట‌ల పాటు చ‌ర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్-జులై కాలంలో సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో ప‌రిశుభ్ర‌త ప‌ట్ల ప్ర‌జా సానుకూల‌త ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవటం,
ఆసుప‌త్రుల్లోని స‌మ‌స్య‌లు, స‌మ‌న్వ‌యం వంటి అంశాల‌పై సూప‌రింటెండెంట్లు, ఏజెన్సీల వారి నుంచి వివ‌ర‌ణ కోరారు. ప్ర‌భుత్వ వైద్య, న‌ర్సింగ్ క‌ళాశాల‌లు, బోధానాసుప‌త్రులు, సెకండ‌రీ ఆసుప‌త్రుల్లో శానిటేష‌న్ మ‌రియు సెక్యూరిటీ పెస్ట్ కంట్రోల్ సేవ‌లందించేందుకు
రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన సిబ్బంది నియ‌మికాలు, వాస్త‌వంలో న‌మోద‌వుతున్న హాజ‌రు, వ్య‌త్యాసాలను మంత్రి ఆరా తీశారు. ఎఫ్ఆర్ య‌స్ విధానంలో పూర్తి స్థాయి హాజ‌రు న‌మోదు కాక‌పోవ‌డానికి కార‌ణాల‌పై మంత్రి అధికారులు, ఏజెన్సీల‌ నుంచి తెలుసుకున్నారు
తాము త‌గు స్థాయిలో సిబ్బందిని నియ‌మించినా ఎఫ్ఆర్ య‌స్ హాజ‌రు కొన్ని కార‌ణాల వ‌ల‌న న‌మోదు కావ‌డంలేద‌ని ఏజెన్సీలు తెలుప‌గా, ఈ నెలాఖ‌రుకు మొత్తం సిబ్బంది ఎఫ్ఆర్‌య‌స్ వ్య‌వ‌స్థ‌లో న‌మోద‌య్యేలా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులు, ఎజెన్సీల‌ను మంత్రి ఆదేశించారు.

నిరంత‌ర స‌మీక్ష‌లు జ‌ర‌గాలి

మంగ‌ళ‌వారంనాటి స‌మీక్ష‌లో వైద్య సంస్థ‌ల ఉన్న‌తాధికారులు, స‌ర్వీసులందించే ఏజెన్సీల మ‌ధ్య ఆశించిన స్థాయిలో స‌మ‌న్వ‌యం జ‌ర‌గడంలేద‌ని, పారిశుధ్య మ‌రియు సెక్యూరిటీల ప్రాధాన్య‌త దృష్ట్యా, ఈ అంశాలకు సంబంధించిన అన్ని స‌మ‌స్య‌ల‌నూ ప్ర‌తి వారం క్షుణ్ణంగా స‌మీక్షించి, తీసుకున్న నిర్ణ‌యాల‌ను త‌దుప‌రి చ‌ర్య‌ల‌ను త‌న‌కు అంద‌జేయాల‌ని శాఖ కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ ఆదేశించారు. వివిధ సంస్థ‌ల ప్రాంగ‌ణాల్లోని ప్ర‌ధాన ప్రాంతాల‌కు ప‌ర్య‌వేక్ష‌ణా అధికారుల‌ను నియ‌మించాల‌ని సూచించారు. పూర్తి స్థాయిలో ఎఫ్ఆర్‌య‌స్ ఎన్‌రోల్‌మెంట్ జ‌రిగిన త‌ర్వాత, మ‌రో స‌మీక్ష నిర్వ‌హిస్తామ‌ని అప్ప‌టికి సేవ‌ల నాణ్య‌త మెరుగుప‌డాల‌ని కార్య‌ద‌ర్శి స్ప‌ష్టం చేశారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో డియ‌స్‌హెచ్ చ‌క్ర‌ధ‌ర్ బాబు, డిఇంఈ డాక్ట‌ర్ విష్ణువ‌ర్ద‌న్, ప‌లువురు ఉన్న‌తాధికారులు, ఏజెన్సీల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *