Breaking News

అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి మౌళిక వసతులపై క్షేత్ర స్థాయి సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ తో కలిసి కబాడీగూడెం, సంగడిగుంట, ఆనందపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి, త్రాగునీటి సరఫరా, డ్రైన్ల నిర్మాణం, పారిశుధ్య పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కబాడీగూడెంలో పెండింగ్ లో ఉన్న మేజర్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టాలని, తద్వారా షుమారు 6 వార్డ్ ల ప్రజలు మురుగునీటి ముంపు నుండి బయటపడతారని శాసన సభ్యులు నసీర్ అహ్మద్ తెలియచేయగా, కమిషనర్ పరిశీలించి, మేజర్ డ్రైన్ నిర్మాణంకు వెంటనే మార్కింగ్ చేపట్టాలని సిటి ప్లానర్ ని ఆదేశించారు. మార్కింగ్ మేరకు డ్రైన్ నిర్మాణంకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. త్రాగునీటి సరఫరాలో సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్ఈని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం నగరానికి త్రాగునీటి సరఫరా జరిగే ప్రకాశం బ్యారేజిలోకి పులిచింతల నుండి నీరు వస్తున్నందున, నీటి సరఫరా సమయంలో తగు మోతాదులో క్లోరిన్ ఉండేలా హెడ్ వాటర్ వర్క్స్ ఇంజినీరింగ్ అధికారులు, క్షేత్ర స్థాయిలో శ్యాంపిల్స్ తీసి సిఎంఎం యాప్ లో అప్ లోడ్ చేయాలని ఎమినిటి కార్యదర్శులును ఆదేశించారు. పిచ్చి మొక్కలు పెరిగిన ఖాళీ స్థలాలు సంబందిత యజమానులు శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని, స్పందించని వాటిని జిఎంసి ప్రజారోగ్య విభాగం శుభ్రం చేసి, జిఎంసి బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు. డ్రైన్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, సిల్ట్ ని వెంటనే తరలించాలన్నారు. సంగడి గుంట మెయిన్ రోడ్ డ్రైన్ పై నిర్మాణాలు తొలగించాలని ఏసిపీని ఆదేశించారు. అలాగే రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి ఉండడానికి వీలు లేదని, నిర్మాణదారులు రోడ్లపై వేస్తె తొలగించాలని ప్లానింగ్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న బోర్లు మరమత్తు చేయాలని ప్రజలు కోరగా వాటిని 2 రోజుల్లోగా చేయాలని ఆదేశించారు.
పర్యటనలో డిప్యూటీ కమిషనర్ జి.సాంబశివరావు, సిటి ప్లానర్ రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *