Breaking News

‘స్వచ్ఛ గుంటూరు’ దిశగా జిఎంసి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాన్ని పరిశుభ్రంగా, సుందరంగా మరియు ప్రజా ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ పారిశుధ్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణను విప్లవాత్మకంగా విస్తరించిందని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పిన్పాయింట్ షెడ్యూళ్లు, సిబ్బంది నిబద్ధతతో శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే పారిశుధ్య పనులు ప్రారంభమై, 7 గంటలకల్లా ప్రధాన రహదారుల శుభ్రం పూర్తయిన తర్వాత, ఒక టన్ను సామర్థ్యం గల ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తారని తెలిపారు. ప్రతి ఆటోకు సుమారు ఒక వెయ్యి గృహాలను కేటాయించి, జీపీఎస్ జియో ట్యాగింగ్ ద్వారా ప్రక్రియను పారదర్శకంగా పర్యవేక్షిస్తున్నామన్నారు. వాణిజ్య సముదాయాలు, ఇళ్ల నుండి చెత్త సేకరణ ఉదయం 10:30 గంటలకు పూర్తవుతుందని, తిరిగి మధ్యాహ్నం 2:30 గంటల నుండి ప్రారంభమయ్యే రెండో షిఫ్ట్‌లో వార్డుల వారీగా డ్రైన్లల్లో పూడికతీత, గ్యాంగ్ వర్క్ నిర్వహిస్తున్నారన్నారు. మేజర్ డ్రైన్ల శుభ్రతకు మెకానికల్ డ్రైన్ క్లీనింగ్ యంత్రాలను, ప్రత్యేక సిల్ట్ బ్యాచ్‌లను ఉపయోగిస్తున్నారన్నారు.
సాధారణ పారిశుధ్యంతో పాటు అక్రమ చెత్త డంపింగ్, ఖాళీ స్థలాల పరిశుభ్రత మరియు దోమల నివారణపై జీఎంసీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రద్దీ ప్రాంతాలు, ప్రధాన రహదారులను పరిశుభ్రంగా ఉంచేందుకు ఆరు మెకానికల్ స్వీపింగ్ మెషిన్లతో రాత్రి వేళల్లో కూడా ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, నగర ప్రవేశ మార్గాలు, జాతీయ రహదారులు, సర్వీసు రోడ్లను కూడ శుభ్రపరుస్తున్నారని తెలిపారు. ప్రజారోగ్య సిబ్బంది వారంలో 7 రోజులూ నిబద్ధతతో పనిచేస్తుండగా, వారికి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) యాప్ ద్వారా హాజరును పర్యవేక్షిస్తున్నామన్నారు.
జిఎంసి కాల్ సెంటర్, పిజిఆర్ఎస్, ఏపీసిఎంఎంఎస్, పురమిత్ర వంటి పోర్టళ్ల ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించేందుకు బృందాలను కేటాయించామన్నారు. చెత్తను తడి-పొడిగా ఇంటి వద్దే వేరుచేయడంపై అవగాహన కల్పిస్తూనే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్నిఅరికట్టేందుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ప్లాస్టిక్ నియంత్రణను ఉల్లంఘించే వారిపై, బహిరంగ ప్రదేశాలు, కాలువల్లో చెత్త వేసే వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నామన్నారు. సుస్థిరాభివృద్ధి చర్యల్లో భాగంగా ప్రతి ఎన్నికల వార్డులో కనీసం ఒక కంపోస్టింగ్ యూనిట్, ఆర్‌ఆర్‌ఆర్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఈ-వేస్ట్ సేకరణకు ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తెచ్చారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాల్వల్లో నీరు నిలవకుండా, డ్రెయిన్ పూడికతో ముంపు వాటిల్లకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు కూడ తమ ఇళ్లల్లో వచ్చే వ్యర్ధాలను తడిపొడిగా వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్ వాడకాన్ని విస్మరించి, పరిశుభ్రమైన మరియు పచ్చదనంతో కూడిన ‘స్వచ్ఛ గుంటూరు’ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *