Breaking News

102 ఉచిత సేవ తల్లీబిడ్డల ఆరోగ్యానికి భరోసా… : ఎమ్మెల్యే బొండా ఉమా

-పేదల ఆరోగ్యానికి పెద్దపీట.. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
-తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ సేవలకు ఆధునిక సాంకేతికత జోడింపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద ఈరోజు “తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్” నూతన వాహనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు  బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తల్లులు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యం అందించేందుకు నూతన తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని,ప్రతి తల్లి, ప్రతి బిడ్డకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని…గత ఐదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి, ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. గర్భిణీలు, బాలింతల కోసం తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ సేవలను ఆధునిక సాంకేతికతతో మరింత బలోపేతం చేస్తున్నామని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా సాంకేతిక వ్యవస్థను అనుసంధానం చేస్తున్నామని వివరించారు.

అదేవిధంగా ప్రమాదాలు లేదా ఇతర కారణాలతో మృతి చెందిన పేదల మృతదేహాలను ఉచితంగా వారి ఇంటి వద్దకు చేర్చేందుకు మహాప్రస్థానం వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ అంబులెన్స్‌ల పేరుతో పేద కుటుంబాలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ సేవలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళలకు అవసరమైన కిట్లు, పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు అందిస్తున్నామని, పేద కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని తెలిపారు. గత 24 నెలల్లో పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందని, రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని క్రిటికల్ కేర్ సెంటర్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి, పేదలకు అత్యాధునిక అత్యవసర వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.

పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న ఉచిత, నాణ్యమైన వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అవసరం లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి భారీగా డబ్బులు ఖర్చు చేయవద్దని ఆయన సూచించారు. పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి చంద్రబాబు ప్రభుత్వం పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. శ్రావణ బాబు, సూపరిండెంట్ రఘునందన్, ఆర్ ఎం ఓ ఝాన్సీ రాణి, డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఇందుమతి దేవి, డిప్యూటీ సూపరిండెంట్, డాక్టర్ కేశవ చంద్ర, డి ఐ ఓ డాక్టర్ శరత్ బాబు, డిపి ఎం ఓ డాక్టర్ నవీన్, RBSK ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి నాయుడు, డాక్టర్ సునీల్ కుమార్, డిపిఓ మహేశ్వరరావు, సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్టర్ సోమనా అనిల్, మద్దినేని సుబ్రహ్మణ్యం మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *